కాళేశ్వరం, డిసెంబర్ 11 : ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని ఎక్కడెక్కడ నుంచో వచ్చారు. తిరుగు ప్రయాణంలో సరిపడా బస్సు లు లేక రోజంతా ఇక్కడే చిక్కిపోయారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల ద్వారా కాళేశ్వరానికి చేరుకున్నారు. ఒక్కరోజే దాదాపు 25 వేల పైచిలుకు భక్తులు వచ్చినట్లు అంచనా. గోదావరిలో స్నానాలు, దేవస్థానంలో పూజలు ముగించుకున్నాక బస్టాండ్‌కు చేరుకున్నారు. అడపదడపా వచ్చే బస్సుల ద్వారా సాయంత్రం వరకు దాదాపు 15వేల మంది గమ్య స్థానాలకు వెళ్లిపోగా, మిగతా 10వేల మంది బస్టాండ్‌లోనే నిరీక్షించాల్సి వచ్చింది.