నర్సంపేట నియోజకవర్గంలోని రహదారులకు మహర్దశ పట్టనుంది. వర్షాలతో దెబ్బతిన్న బీటీ, సీసీ రోడ్ల మరమ్మతుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చొరవతో ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ (ఎఫ్డీఆర్) కింద సీఎం కేసీఆర్ రూ.63.88 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లోని రోడ్ల మరమ్మతు చేసేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టారు. కాంట్రాక్టర్లు త్వరలోనే అగ్రిమెంట్ కుదుర్చుకొని రోడ్ల పనులను ప్రారంభించనున్నారు. 25 బీటీ రోడ్లకు రూ.36.73 కోట్లు, 49 ఇంటర్నల్ సీసీ రోడ్ల అభివృద్ధికి రూ.27.15 కోట్లు వెచ్చించనున్నారు.
వరంగల్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : పైలట్ ప్రాజెక్టులకు కేరాఫ్‌గా మారిన నర్సంపేట శాసనసభ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రాజెక్టు ఇచ్చింది. భారీ వర్షాలతో ఈ నియోజకవర్గం పరిధిలో దెబ్బతిన్న బీటీ, సీసీ రోడ్ల మరమ్మతులకు రూ.63.88 కోట్లు మంజూరు చేసింది. ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్(ఎఫ్డీఆర్) కింద రాష్ట్ర ప్రభుత్వం నర్సంపేట నియోజకవర్గానికి మాత్రమే ఈ నిధులు కేటాయించడం విశేషం. గత సీజన్లో ఈ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాం తాల్లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురిశాయి. నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లో పలుమార్లు అత్యధిక వర్షపాతం నమోదైంది. వాగులు, ఒర్రెలు వరద నీటితో పొంగి ప్రవహించాయి. చెరువులు రోజుల తరబడి మ త్తడి దుంకాయి. వరద బీభత్సంతో ఒక గ్రామం నుంచి మరో గ్రామం వరకు ఉన్న బీటీ రోడ్లతో పాటు ఆయా గ్రామంలోని సీసీ రోడ్లు దెబ్బతిన్నాయి. కల్వర్టులు, కా జ్వేలు, వంతెనల వద్ద రహదారులు పూర్తిగా కోతకు గురయ్యాయి. కంకర తేలడం, గుంతలు ఏర్పడడం వ ల్ల బీటీ, సీసీ రోడ్లు అధ్వానంగా మారాయి. వీటిపై వా హనాలు సర్కస్ చేస్తున్నాయి. ప్రయాణించేందుకు ప్ర జలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిసి వరదలతో బీటీ, సీసీ రోడ్లు దెబ్బతిని ప్రజలు అవస్థలు పడుతున్నారని విషయాన్ని వివరించారు. రోడ్ల మరమ్మతు కోసం ఎఫ్డీఆర్ నిధులు మం జూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ వెంటనే రోడ్ల మరమ్మతులకు ఎఫ్డీఆర్ నిధులు మంజూరు చేయాలని అధికార యం త్రాంగాన్ని ఆదేశించారు. అప్పటికే నర్సంపేట నియోజకవర్గానికి చెందిన 74 రహదారుల అభివృద్ధికి సం బంధించిన అంచనాలు తమ వద్ద రెడీగా ఉండడంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖ ఉన్నతాధికారులు రూ.63.88 కోట్లు కేటాయించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా వెలువడడంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషి ఫలించింది. 25 బీటీ రోడ్ల అభివృద్ధికి రూ.36.73 కోట్లు, 49 ఇంటర్నల్ సీసీ రోడ్ల అభివృద్ధికి రూ.27.15 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో 25 బీటీ రోడ్లను 53.53 కిమీ అభివృద్ధి చేసేందుకు రూ.36.73 కోట్లు, 49 ఇంటర్నల్ సీసీ రోడ్లను 85.16 కిమీ అభివృద్ధి చేయడానికి రూ.27.15 కోట్ల అంచనా వ్యయంతో కొద్ది రోజుల క్రితం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టారు. దెబ్బతిన్న బీటీ, సీసీ రోడ్లను అభివృద్ధి చేసే పనులను 12 ప్యాకేజీల ద్వారా చేపట్టేందుకు నిర్ణయించారు. ప్యాకేజీ వారీగా టెండర్ల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. కొద్దిరోజుల్లో ఈ టెండర్ల ప్రక్రియ పూర్తికానుంది. టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు త్వరలోనే అగ్రిమెంట్ కుదుర్చుకొని బీటీ, సీసీ రోడ్ల పనులను మొదలు పెట్టనున్నారు.
నర్సంపేట మండలంలోని జీజీరాజపల్లి- గోబ్రియతండా రోడ్డుకు రూ.56 లక్షలు, రాంనగర్- నారక్కపేట రోడ్డుకు రూ.1.40 కోట్లు, చంద్రయపల్లి-నారక్కపేట రోడ్డుకు రూ.1.61 కోట్లు, నల్లబెల్లి మండలంలోని పీఆర్ రోడ్డు- శంషాబాద్ రోడ్డుకు రూ.63, పీఆర్‌రోడ్డు- సాయిరెడ్డిపల్లె రోడ్డుకు రూ.91 లక్షలు, పీఆర్ రోడ్డు- లెంకలపల్లి రోడ్డుకు రూ.1.19 కోట్లు, రేలకుంట- ముచ్చింపుల రోడ్డుకు రూ.3.50 కోట్లు, ఆర్అండ్బీ రోడ్డు- గుంటూరుపల్లి రోడ్డుకు రూ.1.47 కోట్లు, నారక్కపేట- మేడపల్లి రోడ్డుకు రూ.1.50 కోట్లు, గుండ్లపహాడ్- గాంధీనగర్ రోడ్డుకు రూ.1.19 కోట్లు, మేడపల్లి- గుండ్లపహాడ్ రోడ్డుకు రూ.2.60 కో ట్లు, ఎంవీపల్లె బీటీరోడ్డు- గోవిందాపూర్ రోడ్డుకు రూ.2 కోట్లు, దుగ్గొండి మండలంలోని వెంకటాపూర్ నుంచి మహ్మదాపురం మీదుగా రాజేశ్వర్‌రావుపల్లె రో డ్డుకు రూ.4.41 కోట్లు, చలపర్తి- తిమ్మంపేట రోడ్డుకు రూ.42 లక్షలు, రేబల్లె స్కూల్- బిక్కాజిపల్లి రోడ్డుకు రూ.1.20, రేకంపల్లి- తిమ్మంపేట రోడ్డుకు రూ.1.75 లక్షలు, నెక్కొండ మండలంలోని అప్పల్రావుపేట- మడిపల్లి రోడ్డుకు 1.63 కోట్లు, పీఆర్‌రోడ్డు- ధర్మతం డా రోడ్డుకు రూ.36 లక్షలు, బంజరుపల్లి- ముదిగొండ రోడ్డుకు రూ.1.28 లక్షలు, చెన్నారావుపేట మండలంలోని సీతరాంపూర్- ఉప్పరపల్లి రోడ్డుకు రూ.1.95 కోట్లు, బోజేర్వు- జగ్గుతండా రోడ్డు కు రూ.94 లక్షలు, ఖానాపురం మండంలోని ధర్మరావుపేట- పవుడాలగుట్ట రోడ్డుకు రూ.1.47 లక్షలు, బుధరావుపేట- మనుబోతులగడ్డ రోడ్డుకు రూ.1.27 కోట్లు, ఖానాపురం- పెద్దమ్మగడ్డ రోడ్డుకు రూ.24 లక్షలు, అశోక్‌నగర్- గంగదేవిబోడు రోడ్డుకు రూ.1.25 కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
సీసీ రోడ్ల అభివవృద్ధికి నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామానికి రూ.1.10 కోట్లు, గురిజాలకు రూ.1.20 కోట్లు, ఇటికాలపల్లికి రూ.40 లక్షలు, ముత్తోజిపేటకు రూ.30 లక్షలు, దాసరిపల్లెకు రూ.30 లక్షలు, నల్లబెల్లి మండల కేంద్రానికి రూ.1.60 కోట్లు, రేలకుంటకు రూ.90 లక్షలు, నందిగామకు రూ.80 లక్షలు, రుద్రగూడెం రూ.50 లక్షలు, దుగ్గొండి మండలంలోని ముద్దునూరుకు రూ.50 లక్షలు, మల్లంపల్లికి రూ.20 లక్షలు, చంద్రయపల్లికి రూ.20 లక్షలు, మర్రిపల్లికి రూ.20 లక్షలు, మహ్మదాపురానికి రూ.70 లక్షలు, తిమ్మంపేటకు రూ.1.10 కోట్లు, రేఖంపల్లికి రూ.30, లక్ష్మీపురంకు రూ.40 లక్షలు, బంధంపల్లికి రూ.30 లక్షలు, నాచినపల్లికి రూ.60 లక్షలు, దుగ్గొండికి రూ.30 లక్షలు, అడవిరంగాపురానికి రూ.15 లక్షలు, రాజ్యతండాకు రూ.15 లక్షలు, ఖానాపురం మండంలోని అశోక్‌నగర్‌కు రూ.1.20 కోట్లు, ఖానాపురం రూ.30 లక్షలు, బుధరావుపేటకు రూ.1.60 కోట్లు, ధర్మరావుపేటకు రూ.50 లక్షలు, మంగళవారిపేటకు రూ.40, దబీర్‌పేటకు రూ.30 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. చెన్నారావుపేట మండలంలోని కోనాపురానికి రూ.50, చెన్నారావుపేటకు రూ.40 లక్షలు, ఉప్పరపల్లికి రూ.1.20 కోట్లు, అమీనాబాద్‌కు రూ.50 లక్షలు, జల్లికి రూ.50 లక్షలు, లింగగిరికి రూ.50 లక్షలు, పాపయ్యపేటకు రూ.60 లక్షలు, నెక్కొండ మండలంలోని దీక్షకుంటకు రూ.60 లక్షలు, ముదిగొండకు రూ.30 లక్షలు, బంజరుపల్లికి రూ.20 లక్షలు, పనికరకు రూ.20 లక్షలు, చంద్రుగొండకు రూ.20 లక్షలు, గొల్లపల్లికి రూ.15 లక్షలు, నెక్కొండకు రూ.1.20 కోట్లు, పెద్దకోర్పోలుకు రూ.50 లక్షలు, సూరిపల్లికి రూ.30 లక్షలు, నాగారానికి రూ.1.10 కోట్లు, రెడ్లవాడకు రూ.50 లక్షలు, వెంకటాపూర్‌కు రూ.30 లక్షలు, తోపనపల్లికి రూ.30 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు పీఆర్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు వెల్లడించారు.