పారితోషికం.. పరిహాసం!
కుల గణన సర్వే ఎన్యుమరేటర్లకు ఇచ్చే పారితోషి కం పరిహాసంగా మారింది. నెల రోజు ల పాటు పని చేయించుకొని, పారితోషికం చెల్లించడంలో ప్రభుత్వం నిర్ల క్ష్యం చేస్తున్నది. సర్వే నిర్వహించి 22 నెలలు గడుస్తున్నా నేటికీ డబ్బులు అందలేదు. దీంతో వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 2024లో ఇం టింటి సర్వే నిర్వహించింది.
- కుల గణన సర్వే చేసి 22 నెలలు
- ఎన్యుమరేటర్లకు నేటికీ డబ్బులు ఇవ్వని ప్రభుత్వం
- ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున సర్కారు బాకీ
- మానుకోట జిల్లాలో 213 మంది సూపర్వైజర్లు, 970 మంది ఎన్యుమరేటర్లు
నెల్లికుదురు, జూన్ 23 : కుల గణన సర్వే ఎన్యుమరేటర్లకు ఇచ్చే పారితోషి కం పరిహాసంగా మారింది. నెల రోజు ల పాటు పని చేయించుకొని, పారితోషికం చెల్లించడంలో ప్రభుత్వం నిర్ల క్ష్యం చేస్తున్నది. సర్వే నిర్వహించి 22 నెలలు గడుస్తున్నా నేటికీ డబ్బులు అందలేదు. దీంతో వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 2024లో ఇం టింటి సర్వే నిర్వహించింది. మహబూ బాబాద్ జిల్లాలో 213 మంది సూపర్వైజ ర్లు, 970 మంది ఎన్యుమరేటర్లు విధు ల్లో పాల్గొన్నారు. వారు సర్వే చేసి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పైసా కూడా ఇవ్వలేదు.
ఇందులో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్ల ను ఎన్యుమరేటర్లుగా, సూపర్వైజర్లను నియమించింది. సర్వే సమాచారాన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ల సాయంతో ఆన్లైన్ చేయించింది. ఈ ప్రక్రియ సుమా రు నెల రోజుల్లో పూర్తి కాగా, నేటికీ పారితోషికం అందించకుండా సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. జిల్లాలో 80 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున మొత్తం 970 మందిని నియమించారు. గ్రామాల్లో వారికి కేటాయించిన పరిధిలో ముందుగా ఇంటింటికీ తిరిగి స్టిక్కర్ వేసి, సమాచారం నమోదు చేశారు.
ఇక సూపర్వైజర్లు సర్వేను పరిశీలిస్తూ, నింపిన ఫాంలను సేకరించి డేటా ఎంట్రీ ఆపరేటర్ల సా యంతో ఆన్లైన్ చేయించారు. అయి తే, తెలంగాణ సర్కారు సర్వే చేయించడంలో చూపిన శ్రద్ధ పారితోషికం చెల్లించడంలో చూపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సర్వే డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. కాగా, ఆన్లైన్ ఈ-కుబేరలో సమస్యతో మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జిల్లాలకు చెందిన సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లకు డబ్బులు ఇవ్వలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

