చెన్నారావుపేట, జూలై 11 : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి దక్కలేదని అతడు కక్ష పెంచుకున్నాడు. అదును కోసం కాపుకాసి ఉన్మాదిలా మారి ఆమె తల్లిదండ్రులను హతమార్చాడు. ఈ దా రుణమైన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చిం తలతండా గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బానోత్ శ్రీనివాస్(40), సుగు ణ (35) దంపతులకు కుమార్తె దీపిక, కుమారుడు మదన్‌లాల్ ఉన్నారు. దీపిక మండలంలోని అమీనాబాద్ మోడల్ పాఠశాలలో చదువుతున్న సమయంలో పాఠశాలకు తీసుకువెళ్లే గూడూరు మండ లం గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బన్ని అలియాస్ నాగరాజుతో పరిచయం ఏర్పడి ప్రే మగా మారింది. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసి హనుమకొండలోని ఓ ప్రైవేట్ కళాశాల లో డిగ్రీ చదువుతున్న సమయంలో నాగరాజు మాయమాటలు నమ్మిన దీపిక పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకుంది. అప్పటికి దీపిక మైన ర్ కావడంతో తల్లిదండ్రులు తమ కూతురిని మో సం చేసి నాగరాజు పెళ్లి చేసుకున్నాడని చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసుపెట్టారు. విచారించిన పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి పెద్దల సమక్షం లో విడాకులు ఇప్పించారు.
అప్పటి నుంచి దీపిక తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్న నాగరాజు బుధవారం రాత్రి ఆరు బయట నిద్రిస్తున్న దీపిక తల్లిదండ్రులపై వేట కొడవలితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన దీపికతో పాటు ఆమె తమ్ము డు మదన్‌లాల్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో దీపిక తల్లి అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తీ వ్రంగా గాయపడిన దీపిక, మదన్‌లాల్‌ను వరంగల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. దాడి అనంత రం వేట కొడవలిని గూడూరు మం డలం గుండెంగ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నిందితుడు పడేశా డు. విషయం తెలిసిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాగరా జు స్నేహితుడు పవన్‌ను పోలీసులు పట్టుకోగా స్థానికులు అతడిపై దాడికి యత్నించడంతో వారిని అడ్డుకొని చెన్నారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా హత్య విషయం తెలిసిన తండా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బాధితుల బంధువులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అప్పటి వరకు మృతదేహాలను తరలించొద్దని పట్టుపట్టడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ డీ సీపీ రవీందర్, నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్ ఘ టనా స్థలానికి చేరుకొని నిందితులకు కఠిన శిక్ష ప డేలా చూస్తామని హామీ ఇచ్చి పోస్టుమార్టం నిమి త్తం నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి వెంట నెక్కొండ సీఐ చంద్రమోహన్, చెన్నారావుపేట ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపారు.
గూడూరు : చెన్నారావుపేట మండలం 16 చిం తలతండాలో జరిగిన జంట హత్యల నేపథ్యంలో గూడూరు మండలం గుండెంగలో పోలీసులు గు రువారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హ త్య చేసింది గుండెంగకు చెందిన ఆటో డ్రైవర్ నాగరాజు కావడంతో ముందస్తుగా గూడూరు సీఐ బాబురావు, ఎస్సై నగేశ్ రాత్రి వరకు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.