ఖానాపురం, జనవరి 12 : పాకాల ప్రాజెక్టు కింద అదనపు ఆయకట్టుకు సాగునీరందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి దబీర్‌పేట శివారు దబ్బవాగు వద్ద గోదావరి జలాలకు, పాకాల కట్టమైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్, ఇరిగేషన్‌శాఖ మంత్రి హరీశ్‌రావు సహకారంతో పాకాల, రంగాయ చెరువు ప్రాజెక్టుల ను పూర్తిచేయించామన్నారు. ఎంతో కష్టపడి అధికారుల సమన్వయంతో సమ్మక్క సాగర్, భీంఘన్‌పూర్, రామప్ప నుంచి పాకాలకు గోదావరి జలాలను ప్రణాళికాబద్ధంగా తరలించామన్నారు. ఆనాటి సంకల్పం నెరవేరిందని, రైతులు రెండు పంటలు పండించుకుంటున్నారని తెలిపారు.
పాకాల ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన సమయంలోనే దబీర్‌పేట, చిలుకమ్మనగర్, మంగళవారిపేట గ్రామాల్లో అదనపు ఆయకట్టుకు నీరందించేందుకు అనుమతులు సాధించుకున్నామన్నారు. దబ్బవాగు వద్ద కూసుకుంట డైవర్షన్‌తో దబీర్‌పేట, సంగెం కాలువ ఎక్స్‌టెన్షన్‌తో మంగళవారిపే ట, నాజీతండా, వేపచెట్టుతండా భూములకు నీరందించేలా డిజైన్ చేశామన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టినందున ప్రస్తుత ఎమ్మెల్యే వెంటనే అదనపు ఆయకట్టుకు సా గునీరందించే ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. పాకాల ప్రాజెక్టుకు 3, రంగాయ చెరువుకు 2 టీఎంసీలు, మొత్తం 5 టీఎంసీల నీటికి అనుమతులున్నాయని, వీటితో 60 వేల ఎకరాకలు సాగునీరందించవచ్చన్నారు.
రైతుల శ్రేయస్సు దృష్ట్యా రాకపోకలకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో పాకాల వాగు పై కొత్తూరు-చెన్నారావుపేట మధ్య, తిమ్మరాయినిపహాడ్ శివారులో, ధర్మరావుపేట జగ్గుతండా శివారు లో బ్రిడ్జిల నిర్మాణానికి కోట్లాది రూపాయలతో గత ప్రభుత్వంలో అనుమతులు తీసుకొచ్చామని, టెండర్ల ప్రక్రియను సైతం పూర్తిచేశామన్నారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెచ్చినవన్నీ దొంగ జీవోలన్న కాంగ్రెస్ నాయకులు వాటితో నే కాంట్రాక్ట్ పనులు చేస్తుంటే ఎలా చెల్లుబాటవుతున్నాయని ప్రశ్నించారు.
సాగునీటి రంగంలో డీబీఎం 38, 40, 48ల కింద 278 చెరువులు నింపే ప్రక్రియ చేపట్టామని, దానిపై దృష్టి పెట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిపోయిన బ్రిడ్జిల నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు. సన్న ధాన్యానికి బోనస్ బో గస్గా మారిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాం గ్రెస్ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నదని, ఎన్నికలు కాగానే పథకాలన్నీ నిర్వీర్యమైపోతాయని పెద్ది అన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, మాజీ ఎంపీపీ వే ములపల్లి ప్రకాశ్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, వేజళ్ల కిషన్‌రావు, ఇర్కు దేవేందర్‌రావు, కవిత, మస్తాన్, రాంబాబు, ఆబోతు అశోక్, కాస ప్రవీణ్‌కుమార్, రాజు యాదవ్ పాల్గొన్నారు.