మరిపెడ, జనవరి 22 : మరిపెడ ఇండోర్ స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు పట్టణ వాసులను అలరించాయి. ఆదివారం డబుల్స్, సింగిల్ మెన్ 40 ప్లస్ విభాగాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలతో పాటు తెలంగాణ నుంచి 120కి పైగా జట్లు తలపడ్డాయి. జాతీయ స్థాయి క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్న నేపథ్యంలో ఇండోర్ స్టేడియం కిక్కిరిసిపోయింది. 40 ప్లస్ డబుల్స్ విభాగంలో సురేశ్‌బాబు-ఉదయ్‌భాస్కర్(వైజాగ్)ప్రథమ స్థానం దక్కించుకోగా, సునీల్ కుమార్-జగన్నాథం (రాజమండ్రి) ద్వితీయ స్థానంలో, రాము- సీతాభద్రం(తెనాలి) తృతీయ స్థానంలో నిలిచారు.
మరిపెడ జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు వేదిక కావడం హర్షణీయమని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. 40 ప్లస్ విభాగంలో విజేతలకు షీల్డ్‌లు అందజేశారు. విజయవంతంగా టోర్నీ నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్‌రావును ప్రశంసించారు. అనంతరం జాతీయ క్రీడాకారుడు కటికనేని ప్రవీణ్‌కుమార్‌ను నవీన్‌రావు సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హరిత, మండలాధ్యక్షుడు రామసహాయం సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ గుగులోత్ అరుణ, జడ్పీటీసీ తేజావత్ శారద, మాజీ ఎంపీపీ గుగులోత్ వెంకన్న, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, దామోదర్ రెడ్డి, పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు దిగజర్ల శ్రీనివాస్, పానుగోత్ వెంకన్న, రాంపెల్లి రవి, సయ్యద్ లతీఫ్, మాచర్ల భద్రయ్య, రేఖ వెంకటేశ్వర్లు, నాయకులు గుగులోత్ రాంబాబు, తేజావత్ రవీంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. కాగా, నవీన్‌రావు విజ్ఞప్తితో డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ టీయూఎఫ్ఐడీసీ గ్రాంట్ నుంచి రూ.3కోట్ల నిధులు మంజూరు చేయించి ఆడిటోరియం, బ్యాడ్మింటన్ క్లబ్ నిర్మించారు. 206 టీమ్‌లు ఈ పోటీల్లో తలపడుతుండగా, మొత్తం రూ.3లక్షల40వేల ప్రైజ్‌మనీ అందజేశారు.
– వీ ఉదయ్‌భాస్కర్, ఇంటర్నేషనల్ క్రీడాకారుడు, వైజాగ్
మరిపెడలో 13 సంవత్సరాలుగా జరుగుతున్న టోర్నీలకు హాజరవుతున్నాను. జాతీయస్థాయి ప్రమాణాలతో నిర్మించిన స్టేడియంలో పోటీల నిర్వహణ సంతోషం కలిగించింది. సింగపూర్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో పోటీల్లో పాల్గొన్నాను. ఇక్కడి వసతులు నచ్చే పోటీలకు హాజరయ్యాను.
– సూర్య, జాతీయ క్రీడాకారుడు, హైదరాబాద్
మరిపెడలో జరుగుతున్న ఓపెన్ టోర్నీకి హైదరాబాద్ నుంచి వచ్చాను. 40 ప్లస్ విభాగం పోటీల్లో పాల్గొన్నాను. వసతులు, అతిథ్యం బాగున్నాయి. ఇక్కడి యువతకు నిత్యం ప్రాక్టీస్ చేసుకునేందుకు స్టేడియం అద్భుతంగా ఉంది.
– యాదలపురం అజయ్, షటిల్ క్రీడాకారుడు, మరిపెడ
డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ చొరవతో పాటు టోర్నీ నిర్వాహకుకు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు నేతృత్వంలో 13ఏళ్లుగా టోర్నీ జరుగుతోంది. జాతీయ క్రీడాకారుల హాజరుతో మరిపెడకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
– టోర్నీ నిర్వాహకుడు గుడిపూడి నవీన్‌రావు
దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఇక్కడి యువతకు స్ఫూర్తిని కలిగించారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు, సహకరించిన ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, వలంటీర్లకు కృతజ్ఞతలు.