గ్రూప్-1 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ప్రిలిమినరీ పరీక్షకు ఐదు జిల్లాల్లో 34,113 మంది హాజరయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 17 కేంద్రాల్లో 4,473 మంది అభ్యర్థులకు 3,331 మంది పరీక్ష రాశారు. జనగామలోని 14 కేంద్రాల్లో 3,697 మంది అభ్యర్థులకు 2,949 మంది హాజరయ్యారు. మహబూబాబాద్‌లో 4,412 మందికి 3,377 మంది పరీక్ష రాశారు. వరంగల్‌లో 9,092 మంది అభ్యర్థులకు 6622 మంది పరీక్షకు హాజరయ్యారు. హనుమకొండలో 45 కేంద్రాల్లో 22,665 మంది అభ్యర్థులకు 17,834 మంది పరీక్ష రాశారు. నిమిషం ఆలస్యంగా చేరుకున్న వారికి పోలీసు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారు కన్నీటి పర్యంతమై వెనుదిరిగారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్లు భవేశ్‌మిశ్రా, షేక్ రిజ్వాన్ బాషా, ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, పోలీస్ కమిషన్ అంబర్ కిశోర్‌ఝా, ఎస్పీ రాంనాథ్ కేకన్ పరిశీలించారు. కాగా, హంటర్‌రోడ్‌లోని గ్రీన్వుడ్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సెంటర్లో థర్డ్‌జెండర్ నేహ అలియాస్ పాల్తియా లక్ష్మణ్ పరీక్ష రాసింది.
– నమస్తే నెట్వర్క్, జూన్ 9