శాయంపేట మే 11 : మండల కేంద్రంలోని పురాతనమైన శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయంలో స్వామివారి కల్యాణోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి అధ్యయనతిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా భూదేవి శ్రీదేవిలతో శ్రీ మత్స్యగిరి స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. దేవాలయ చైర్మన్ సామల భిక్షపతి దంపతులు ఇంటి నుంచి పట్టు వస్త్రాలను, తలంబ్రాలను మంగళ వాయిద్యాల మధ్య తీసుకువచ్చి స్వామివారికి సమర్పించినారు.
వేదమంత్రాల మధ్య దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి, యాగ్నీకులు వీరవెల్లి వేణుగోపాల చారి స్వామివారి కల్యాణాన్ని శాస్త్రక్తంగా జరిపించారు. కళ్యాణ అనంతరం దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి, రాజమణి దంపతులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గట్ల విజయపాల్ రెడ్డి, సరోజన జిందం మాధవ్, రమ్య ,గ్రామ పెద్దలు జిన్నా ప్రతాప్సేనారెడ్డి, గట్ల భగవాన్ రెడ్డి, జిన్నా కృపాకర్ రెడ్డి, శివరామకృష్ణా రెడ్డి, మనీష్ రెడ్డి, కందగట్ల కోటేశ్వర్, చిందం రవి, భాషని మార్కండేయ, వినుకొండ శంకరాచారి, సుమన్, వనం దేవరాజు, మార్త సుమన్, దిండిగాల వంశీ భాషని బాలకృష్ణ, గిద్దెమారు సురేష్, భక్తులు పాల్గొన్నారు.