పహల్గామ్ దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ ఉగ్రమూకలపై విరుచుకుపడిన సైనికులకు యావత్ సమాజం హ్యాట్సాఫ్ చెబుతున్నది. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. ఎక్కడికక్కడ సంఘీభావ ర్యాలీలు తీస్తూ దేశభక్తిని చాటుతున్నది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో గురు వారం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపారులు, కార్మికులు, రైతులు జాతీయ జెండాలతో ర్యాలీ తీశారు.
మహబూబాబాద్ జిల్లా కురవి, ఇనుగుర్తి మండల కేంద్రాల్లో విద్యార్థులు, అఖిలపక్ష నాయకులు ర్యాలీ చేపట్టి, పాకిస్థాన్ ఖబర్ధార్ అంటూ నినాదాలు చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ ఆధ్యర్యంలో చేపట్టిన ర్యాలీలో మాజీ మంత్రి దయాకర్‌రావు పా ల్గొని మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని సమూలంగా తుదముట్టించేందుకు భారతసైన్యానికి దేశ ప్రజలంతా అండగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తూ రాజకీయాలను పక్కన బెట్టాలని కోరారు.
– వర్ధన్నపేట/కాశిబుగ్గ/ కురవి/ ఇనుగుర్తి, మే 8
ఆపరేషన్ సిందూర్‌తో ముందడుగు
హనుమకొండ చౌరస్తా: పాకిస్థాన్, ఉగ్రవాదంపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు ఆపరేషన్ సిం దూర్‌తో ముం దడుగు పడింది. దీని ద్వారా భారత సాయుధ దళాల సామర్థ్యం స్పష్టంగా తెలిసిం ది. ఈ పోరాటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకు మనదేశ శక్తి అవగాతం కానుంది.
– సింగారపు శ్యామ్, హనుమకొండ
ఉగ్రవాదం అంతం కావాల్సిందే..
హనుమకొండ చౌరస్తా: ఉగ్రవాదం అంతం కావాల్సిందే. భారత సైన్యం ప్రదర్శించిన సాహసానికి ఒక భారతీయుడి గా నేను గర్వపడుతున్నాను. మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శం కావాలి. ఉగ్రవాదాన్ని ఉకుపాదంతో అణిచివేయాలి. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీసుకోవాల్సిందే. దెబ్బకు దెబ్బ కొట్టాలి. మరిన్ని దాడులు చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతం చేయాలి.
– చిర్ర సుమన్, హనుమకొండ
ఊహకందని రీతిలో విరుచుకుపడాలి
హనుమకొండ చౌరస్తా: పహల్గాం ఉగ్రదాడులకు పాల్పడిన వారిని, వారికి మద్దతిచ్చే వారిపై ఊహకందని రీతిలో విరుచుకుపడాలి. ఉగ్రమూకలను మట్టి కరిపించాలి. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీసుకోవడం ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోతున్నది. పాకిస్తాన్‌పై ప్రతిదాడులు చేయడం హర్షణీయం.
– జూలూరి రంజిత్, హనుమకొండ
ఉగ్రమూకలకు తగిన శిక్ష పడింది
దామెర: పాకిస్తాన్ ఉగ్రవాద మూకలకు మన దేశం ఆపరేషన్ సింధూర్ పేరిట తగిన శిక్ష విధించింది. ఉగ్రవాదులను ఏరివేయడం ఎంతో అవసరం. దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న భారత సైన్యం చేసిన ఈ సాహసం ఎంతో గొప్పది. ఆర్మీకి ప్రజలందరు ఎంతో రుణపడి ఉంటారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి టూరిస్టులను కాల్చి చంపడం దారుణం. దేశ ఔన్నత్యాన్ని చాటేలా మన సైనికులు చేసిన ఈ సాహసం చరిత్రాత్మకం.
– దుబాసి నవీన్, ఎన్హెచ్ఆర్సీ హనుమకొండ జిల్లా చైర్మన్