వరంగల్ : ధరణి వద్దంటున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని గీసుగొండ, రాంపూర్, కొనాయిమాకుల గ్రామాల్లో అకాల వర్షాలకు పంట నష్టపోయిన 1477 రైతులకు రూ.1.95 కోట్ల విలువైన నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..దేశంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. సాగుకు మూడు గంటల కరెంట్ చాలు అన్న ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. రైతుల కష్టాలు తెలిసిన నేత సీఎం కేసీఆర్.
అందుకే రైతులకు నిరంతర విద్యుత్ అందజేయడమే కాకుండా సకాలంలో ఎరువులుర, పురుగు మందులు అందజేస్తున్నారు. అంతేకాదు పంటలకు గిట్ట ధర కల్పిస్తూ..కష్ట కాలంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటున్న ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పని చేసే ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.