నర్సంపేట రూరల్, ఏప్రిల్ 16 : ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం నర్సంపేట పట్టణం సర్వాపురం 4వ, 5వ వార్డు, ద్వారకపేట 6వ, 7వ వార్డులో ఉత్తర యుద్ధం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేసే వరకు పోరు ఆగదన్నారు. ఉపాధి పథకానికి ఇటీవల బడ్జెట్లో రూ.30వేల కోట్ల నిధు లు కేటాయించడంతో పని దినాలు కూడా తగ్గాయ ని తెలిపారు. ఉత్తర యుద్ధం కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నదన్నారు. పట్టణ పేద ప్రజలకు ఉపాధి పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. మున్సిపాలిటీల్లో ఉపాధి హామీని కేంద్రం ఎత్తివేయడంతో పేదలకు కూలి పనులు దొరక్క ఇబ్బం ది పడుతున్నారని చెప్పారు.
అలాగే కూలి రేట్లు పెంచాలని, పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. ఉపాధి హామీకి వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తు న్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ప్రభుత్వ సంస్థలను అంబానీ, అదానీకి అప్పగిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, కౌన్సిలర్లు శీలం రాంబాబు, రామసహాయం శ్రీదేవి, మినుముల రాజు, నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, గోనె యువరాజ్, వేనుముద్దల శ్రీధర్‌రెడ్డి, గుంటి కిషన్, పుట్టపాక కుమారస్వామి, శ్రీను, రవి, రమేశ్, భిక్షపతి, నవీన్, రాజ్‌కుమార్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఈజీఎస్‌లో రైతులకు ఉపయోగపడే పనుల్లేవు..
నర్సంపేట : ఉపాధిహామీలో రైతులకు ఉపయోగపడే పనుల్లేవని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నా రు. ఉపాధి హామీలో వివిధ విభాగాలకు చెందిన రాష్ట్ర జేఏసీ చైర్మన్, కో చైర్మన్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీలో 262 పనులను పొందుపర్చినా అవి రైతులకు ఉపయోకరంగా లేవని చెప్పారు. సిబ్బందికి కూడా పని దినాలను ఆధారంగానే వేతనాలు ఇస్తున్నారని, కేంద్రం 50 శాతం పని దినాలను తగ్గించడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఉపాధి హామీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కాగా, ఉత్తర యుద్ధం కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర చైర్మన్ లింగయ్య, కో చైర్మన్లు మోహన్‌రావు, వెంకట్రాం, విజయకుమార్, రాజు, చౌహాన్, యువరాజు తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట పట్టణాన్ని ఉపాధిహామీలో చేర్చాలి..
నర్సంపేట: నర్సంపేట పట్టణాన్ని ఉపాధి హామీ లో చేర్చాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఉత్తర యుద్ధంలో భాగంగా రెండో వార్డులో జర్రు రాజు ఆధ్వర్యంలో ఉత్తరాలను కేం ద్ర మంత్రికి కూలీలతో వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో చాలా వరకు వ్యవసాయ భూములు ఉన్నాయన్నారు. వ్యవసాయానికి ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేయాలన్నారు. మున్సిపాలిటీల్లోనూ ఉపా ధి హామీ పథకాన్ని కొనసాగించడానికి పునరాలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజినీకిషన్, కౌన్సిలర్ జుర్రు రాజుయాదవ్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటనారాయణగౌడ్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, గోనె యువరాజు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పెద్ది పరామర్శ
ఖానాపురం: మండలంలోని కొత్తూరుకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు రాధారపు విజేందర్ ప్రమాదవశాత్తు శనివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి, నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, స ర్పంచ్ బీ రమ, అశోక్ పాల్గొన్నారు.
వడగండ్లతో 37,498 ఎకరాల్లో పంట నష్టం..
నర్సంపేట : వడగండ్లతో నర్సంపేట నియోజకవర్గంలో 37,498 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ఎమ్మెల్యే పెద్ది తెలిపారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడు తూ.. మొత్తం 32,649 మంది రైతుల పంట లు దెబ్బతిన్నాయన్నారు. జిల్లాలో మొత్తం 61,000 ఎకరాల్లో మక్కజొన్న, మిర్చి, వరి, కూరగాయలు, మామిడి తోటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పంట ఏదైనా ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. నర్సపేట మండలంలో 5,280 మంది రైతులకు చెందిన 5,384 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయన్నారు. దుగ్గొండిలో 8374 రైతులు, 10292 ఎకరాలు, చెన్నారావుపేటలో 5369 మంది రైతులు, 5604 ఎకరాలు, ఖానాపురం మండలంలో 4332 మంది రైతులు, 6453 ఎకరాలు, నల్లబెల్లి మండలంలో 3049 మంది రైతులు, 5305 ఎకరాలు, నెక్కొండ మండలంలో 6295 మంది రైతులకు చెందిన 6260 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. మరో వారం రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన జీవో విడుదల అవుతుందని తెలిపారు. 2022లో వడగండ్లతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కుల పంపిణీ 50 శాతం పూర్తయిందని, మిగిలిన వారికీ త్వరలోనే అందిస్తామని చెప్పారు.