వరంగల్, అక్టోబర్ 3 : నగరంలోని చారిత్ర క భద్రకాళీ ఆలయంలో భద్రకాళీ-భద్రేశ్వరుల కల్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. పూలతో అందంగా అలంకరించిన వేదికపై అర్చకులు శేషు ఆధ్వర్యంలో కనులపండువగా నిర్వహించారు. పెళ్లి తంతును తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విజయ దశమి రోజు ఉదయం నిత్యాహ్నికం ని ర్వహించిన అర్చకులు కలశోద్వాసన జరిపారు.
అనంతరం అమ్మవారిని సామ్రాజ్య పట్టాభిషే కం జరిపి చక్రస్నానం, ధ్వజారోహణం జరిపా రు. విజయ దశమి, శరన్నవరాత్రి ముగింపు రోజున అమ్మవారిని దర్శించునేందుకు భక్తులు పోటెత్తారు. పది రోజుల పాటు జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాలు విజయదశమి పర్వదినం తో ముగిశాయి. పది రోజుల పాటు రోజుకో అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.
విజయ దశమి రోజున భద్రకాళీ చెరువులో వైభవంగా నిర్వహించే తెప్పోత్స వం రద్దు కావడంతో నగర ప్రజలు నిరా శ చెందారు. దశాబ్దాలుగా వస్తున్న సం ప్రదాయానికి గండి పడింది. ఈ ఏడాది భద్రకాళీ చెరువులో నీళ్లు లేకపోవడంతో తెప్పోత్సవాన్ని అర్చకులు రద్దు చేశారు. గురువారం ఉదయం అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపి చక్రస్నానంతో మమ అనిపించారు.