TGSRTC | హనుమకొండ చౌరస్తా, జులై 28: శ్రావణమాసంలో భక్తులు శైవక్షేత్రాలను దర్శించుకోవడం కోసం ఆగస్టు 3న హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి ప్రత్యేక పంచారామ దర్శన యాత్రకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు. ఈ యాత్రలో భక్తులు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధి చెందిన పంచారామ క్షేత్రాలైన అమరావతి అమరలింగేశ్వర స్వామి, భీమవరం శ్రీసోమేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరలింగేశ్వరస్వామి, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి, సామర్లకోట భీమేశ్వరస్వామి, ఒకేరోజు ఐదు శైవక్షేత్రాలను దర్శించుకోవచ్చని 3న ఆదివారం సాయంత్రం 6 గంటలకు హనుమకొండ బస్ స్టేషన్ నుంచి ప్రారంభమై సోమవారం అన్ని క్షేత్రాల దర్శనం అనంతరం తిరిగి మంగళవారం ఉదయం హనుమకొండ చేరుకుంటుందన్నారు. సూపర్ లగ్జరీ సర్వీస్ ఛార్జీల వివరాలు పెద్దలకు రూ.2300, పిల్లలకు రూ.1400 ఉంటుందని, పూర్తి సమాచారం, టికెట్ బుకింగ్ కోసం 9063407493 , 7780565971, 9866373825, 9959226047 నంబర్లను సంప్రదించాలని ఆర్ఎం తెలిపారు.