హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 21: దేశాభివృద్ధిలో సైన్స్ కీలకమని, ప్రతి ఒకరికి శాస్త్ర, సాంకేతిక ఫలాలు అందాలని తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు, హైదరాబాద్ సీసీఎంబీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ మోహన్‌రావు ఆకాంక్షించారు. మూడు రోజులుగా కాకతీయ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ప్లీనరీలు, సదస్సులు, టెక్నికల్ సెషన్లు గురువారం ముగిశాయి. కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశ సర్వతోముఖాభివృద్ధిలో సాంకేతిక రంగం ప్రధానమన్నారు.
ఏఐ, ఎంఎల్, స్సేస్ రిసెర్చ్, బయోటెక్నాలజీ రంగాలపై ఫలవంతమైన చర్యలు జరిగాయన్నారు. వీసీ మాట్లాడుతూ లెర్నింగ్, షేరింగ్, పరిశోధనల్లో నాణ్యమైన పురోగతి సాధిస్తామని చెప్పారు. 3 రోజుల్లో ఆరోగ్య పరిరక్షణ, స్పేస్, క్వాంటం వంటి అనేక అంశాల్లో కీలక చర్చలు జరిగాయన్నారు. భవిష్యత్‌లో వాటి ఫలితాలు వస్తాయని అకాంక్షించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం మాట్లాడుతూ శాస్త్రవేత్తలు నూతన ఆవిషరణలపై దృష్టి సారించి సమాజ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలను వెలువరించాలన్నారు.
టీసీఎస్ జనరల్ సెక్రటరీ, ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ ఎస్ సత్యనారాయణ, కేయూ యూజీసీ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఆర్ మల్లికార్జున్‌రెడ్డి, టీపీసీ, టీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ పీ మల్లారెడ్డి, టీసీఎస్ సెషన్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వడ్డె రవీందర్, టీఏఎస్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ సీహెచ్ సంజీవరెడ్డి, నిట్ ప్రొఫెసర్ కే లక్ష్మిరెడ్డి, సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ బీ సురేశ్‌లాల్, కేయూ సైన్స్ డీన్ ప్రొఫెసర్ జీ హన్మంతు, కేయూ ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ గాదె సమ్మయ్య మాట్లాడారు. తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ బైరు వెంకట్రామిరెడ్డి మూడు రోజుల సదస్సు నివేదికను ప్రవేశపెట్టారు. ఇంజినీరింగ్ విభాగాల డీన్ ప్రొఫెసర్ మంచాల సదానందం, కేయూ క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ తాళ్లపల్లి మనోహర్, డాక్టర్ బీ దీపాజ్యోతి, కేయూ ఫార్మసీ ప్రొఫెసర్ ఎన్ ప్రసాద్, ప్రొఫెసర్ రాంరెడ్డి, సారంగపాణి పాల్గొన్నారు.