హనుమకొండ చౌరస్తా, మార్చి 27 : తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ విశ్వవసునామ ఉగాది డైరీని శాసనసభలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. ఈ డైరీలో తిథి, వారనక్షత్ర, యోగాలు, గృహస్థితిలు అనుసరించి రూపొందించినట్లు అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
అలాగే చిత్రకారుడైన కాండూరి కృష్ణమాచారి తాన స్వయంగా చిత్రీకరించిన ముఖ్యమంత్రి చిత్రపటాన్ని రేవంత్ రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, రాష్ర్ట ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాండూరు కృష్ణమాచారి, కన్వీనర్ పరాశరం రవీంద్రచార్యులు, అధ్యక్షుడు బద్రీనాథ్చార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ అగ్నిహోత్ర చంద్రశేఖర్శర్మ, గ్రేటర్ అధ్యక్షుడు బండారి జగపతి, తదితరులు పాల్గొన్నారు.