తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా జిల్లా కేంద్రాల్లో అధికారికంగా జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథులు జెండాలను ఆవిష్కరించారు. ముందుగా తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వరంగల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హనుమకొండలో మంత్రి కొండా సురేఖ, ములుగులో మంత్రి సీతక్క, జయశంకర్ భూపాలపల్లిలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, మహబూబాబాద్, జనగామలో ప్రభుత్వ విప్‌లు రాంచంద్రూనాయక్, బీర్ల అయిలయ్య త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు.
పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల కుటుంబ సభ్యులు, స్వాతంత్య్ర సమర యోధులను సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన శకటాలు ఆకట్టు కున్నా యి. విధి నిర్వహణలో ఉత్తమంగా పనిచేసిన పోలీసులకు మెడల్స్ అందజేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అదేవిధంగా ప్రభు త్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వివిధ ప్ర జా, కార్మిక సంఘాలు, పార్టీలు వాడవాడలా జాతీయ జెండాలను ఎగురవేశారు. అమర వీరులను స్మరించుకొని, వారికి శ్రద్ధాంజలి ఘటించారు.