మహదేవపూర్, జూన్ 30 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో (ఎస్సీ కాలనీ) పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్న తిరుపతి, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో తమ సొంత ఖర్చులతో విద్యార్థులకు సోమవారం స్కూల్ యూనిఫామ్స్ ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం బండం రాజిరెడ్డి, ఉర్దూ మీడియం పాఠశాల తెలుగు భాషోపాధ్యాయులు ఎల్కటి శరత్ మహారాజ్, పసుల శంకర్ నేత, సునీత రాజకుమార్, రామచంద్ర మూర్తి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.