కరీమాబాద్ మార్చి 7 : కల్తీ, కాలం చెల్లిన కూల్డ్రింక్స్పై టాస్క్ ఫోర్స్(Expired cool drinks) అధికారుల కొరడా ఝులిపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కరీమబాద్లోని సాయిబాబా కూల్ డ్రింక్స్ షాప్‌లో తనిఖీలు చేపట్టారు. కాలం చెల్లిన, నాణ్యత లేని 21 రకాల కూల్‌డ్రింక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు కొత్తిమీర రాజును అదుపులోకి తీసుకొని నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ..కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయించినా, నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రముఖ బ్రాండ్లను మార్పు చేసి విక్రయిస్తున్న నకిలీ వస్తువులపై నిఘా పెట్టామన్నారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006, 2011 రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం నిబంధనలు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.