వరంగల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట నియోజకవర్గ మహిళల ఆరోగ్య శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. వరంగల్ ఒమేగా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో, నర్సంపేట పవన్ నర్సింగ్ హోమ్ వారి సౌజన్యంతో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే పెద్ది రెడ్డి ప్రారంభించారు.
అనంతరం హెల్త్ క్యాంపులో భాగంగా ఏర్పాటు చేసిన స్కానింగ్, ఎక్స్-రే పలు రకాల వైద్య పరికరాలను పరిశీలించారు. ఈ వైద్య శిబిరంలో మహిళలకు సంబంధించిన పరీక్షలను ఉచితంగా చేస్తారని, ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ODCMS చైర్మన్ రామస్వామి నాయక్, జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్ పర్సన్ రజని, తదితరులు పాల్గొన్నారు.