మహదేవ్పూర్, జూన్ 12: విద్యార్థులు చదువుల్లో రాణించాలని మహదేవ్పూర్ తహసీల్దార్ వై.రామారావు అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ నుండి మంజూరైన ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అదే విధంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎసీఎస్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం బండం రాజిరెడ్డి, బాలికల పాఠశాల హెచ్ఎం సరిత, ఉపాధ్యాయులు మడక మధు, ప్రభాకర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, అనిత, రమేష్, షాజహాన బేగం, అనిల్, కవిత, దేవేందర్ రెడ్డి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.