హనుమకొండ/మంగపేట, ఆగస్టు 1: హనుమకొండ నక్కలగుట్టలోని వైబ్రెంట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృ తి చెందింది. దీంతో గురువారం కుటుంబసభ్యులు, డీవైఎఫ్ఐ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాలేజీ ఎదుట ధ ర్నా చేపట్టారు. కోపోద్రిక్తులైన వారు ఫర్నిచర్, పూలకుండీలను ధ్వంసం చేశారు. విద్యార్థిని కుటుంబసభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్ పంచాయతీ పరిధి గు డ్డేలుగులపల్లికి చెందిన ఎలక్ట్రికల్ షాపు నిర్వాహకుడు ఎనుముల జనార్దన్‌రెడ్డి-సుమత దంపతుల కూతురు భవాని(15) హనుమకొండలోని వైబ్రెంట్ అకాడమీలో ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్ చదువుతోంది.
గత నెల 15న హోమ్ సిక్ హాలీడేస్‌కు వచ్చిన ఆమె తిరిగి 24న కాలేజీకి వచ్చింది. ఏమైందో ఏమోకాని బుధవారం రాత్రి 11.30 గంటలకు వార్డెన్ ఫోన్ చేసి భవాని కడుపు నొప్పితో ఇ బ్బంది పడుతోందని, రోహిణి ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని, మీరు వెంటనే రావాలని కుటుంబసభ్యులకు తెలిపారు. వారు రాత్రి వచ్చే సరికి ‘మీ కూతురు చనిపోయింది.. ఎంజీఎం దవాఖాన మార్చురీకి తరలించాం’ అని చెప్పారు. తమ కూతురుకు ఆరోగ్య సమస్యలు లేవని, దే నికీ భయపడే పిరికిది కాదని, ఎందుకు ఉరివేసుకుందో తెలువదని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.
కళాశాల యాజమాన్యం ఒత్తిడి, నిర్లక్ష్యంతో చనిపోయిందని బోరున విలపించారు. విద్యార్థిని మృతిపై కుటుంబ సభ్యు లు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. న్యాయ విచారణ జరపాలని, అకాడమీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని కుటుంబానికి న్యాయం చేయాల ని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నె లకొనగా పోలీసులు భారీగా చేరుకున్నారు. కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాలు, కళాశాల యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి పూర్తిస్థాయి విచారణ చేస్తామన్నా రు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సుబేదారి పోలీసులు తెలిపారు.
హనుమకొండ చౌరస్తా: వైబ్రెంట్ జూనియర్ కాలేజీకి అనుమతుల్లేవని డీఐఈవో ఏ గోపాల్ తెలిపారు. నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీని హనుమకొండకు షిఫ్ట్ చేశారని, కార్పొరేట్ అకాడమీల పేరుతో ఇంటర్మీడియెట్ తరగతులు నిర్వహించడం బో ర్డు నిబంధనలకు విరుద్ధమన్నారు. విద్యార్థి మృతి చెందిన కాలేజీని సందర్శించి జరిగిన ఘటనను తెలుసుకున్నట్లు చెప్పారు. కాలేజీకి షోకాజ్ నోటీసులు జారీ చేశానని, రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని యజమాన్యాన్ని ఆదేశాలు జారీ చేసినట్లు డీఐఈవో పేర్కొన్నారు.