Student JAC | ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు..ప్రభుత్వంలో విలీనం చేయాలి: విద్యార్థి జేఏసీ డిమాండ్
Student JAC | ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసంనిర్వహిస్తున్న సమ్మెకు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ సంఘీభావం తెలిపింది.
హనుమకొండ చౌరస్తా : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసంనిర్వహిస్తున్న సమ్మెకు ( RTC Strike ) కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ( Student JAC ) సంఘీభావం తెలిపింది. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చర్చలు జరిపి సమ్మెను విరమింపచేయాలని జేఏసీ చైర్మన్ డి.తిరుపతి డిమాండ్ చేశారు. శుక్రవారం కేయూలో జరిగిన జేఏసీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు .
ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగాల భర్తీ, కార్మికుల బకాయిల చెల్లింపు, కార్మిక సంఘం ఎన్నికలు, ఔట్సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజ్ హామీ లను విస్మరిస్తుందని ఆరోపించారు.
అద్దె బస్సుల ముసుగులో సంస్థను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఎలక్ట్రిసిటీ బస్సులు ప్రైవేటు వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి నడువుతున్నదని విమర్శించారు. సమావేశంలో విద్యార్థి జేఏసీ సీనియర్ నాయకుడు కలకోట్ల సుమన్, కన్వీనర్ కందికొండ తిరుపతి, కార్యదర్శి జనగాం రాజారాం, నాయకులు బొక్క ప్రవర్ధన్, రోనాల్డ్, అశోక్, నరేష్, కుమార్, అనిల్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

