సుబేదారి, జూన్ 29 : వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానం లో హైదరాబాద్ నార్త్ రేంజ్ జా యింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్ శ్వేత నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. సన్ప్రీత్ను హైదరాబాద్ ట్రాఫిక్ జా యింట్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. కాగా, వరంగల్ పోలీసు కమిషనరేట్ ఏర్పడిన తర్వాత తొలి మహిళా సీపీగా 2012 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన శ్వేత బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
వరంగల్ పోలీసు కమిషనర్‌గా సన్‌ప్రీత్‌సింగ్ 2025 మార్చి 13న బాధ్యతలు చేపట్టి 15 నెలలు పనిచేశారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారని పేరు తెచ్చుకున్న ఆయన కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్లో పెట్టేందుకు నిత్యం సమీక్షలు నిర్వహించి పోలీసు అధికారులను అలర్ట్ చేశారు. అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులను ఉపేక్షించకుండా కొరడా ఝళిపించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉన్నప్పటికీ అవినీతి ఆరోపణలు వచ్చిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలపై నిగావర్గాలతో పాటు తనదైన ైస్టెల్లో విచారణ జరిపించారు.
మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిడిని పక్కనపెట్టి, అవినీతి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏసీపీతోపాటు పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు మొత్తం 26 మందిని సస్పెండ్ చేశారు. సిబ్బంది సమస్యలపై దృష్టిపెట్టి, పారదర్శక బదిలీలు, సంక్షేమ కోసం కృషిచేశారు. భాదితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కానికి కృషి చేశారు. కాగా, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే సన్‌ప్రీత్‌సింగ్ బదిలీ అయినట్లు ప్రచారం జరగుతున్నది.