భీమదేవరపల్లి, మే 15: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వేసవి శిబిరాలు గురువారంతో ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా ఎంఈఓ సునీతా రాణి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఓ మౌజయా యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు.
అనంతరం సంస్థ వ్యవస్థాపకులు ఎస్పీ మాస్ట్రో మార్గదర్శకత్వంలో విద్యార్థులకు ఉచితంగా ధృవపత్రాలు అందజేశారు. వేసవి శిబిరం నిర్వహణలో ఐఏయువైయస్ఏ సేవలను గుర్తించి వారికి అభినందన పత్రాన్ని సైతం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోర్ టీమ్ సభ్యులు హుస్సేన్ బాషా, వంశీ, సుష్మా , ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీకాంత్, శ్రీనివాస్, సిసింద్రీ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.