నయీంనగర్, ఫిబ్రవరి 7 : హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వీధి రౌడీల్లా ఒకరినొకరు కొట్టుకున్నారు. వివరాల్లో వెళితే.. ఇంటిగ్రేటేడ్ కెమిస్ట్రీ కోర్సు చదివే మొదటి సంవత్సరం విద్యార్థులు, అదే కోర్సు చదివే రెండో సంవత్సరం వారికి మర్యాద ఇవ్వకపోవడం గొడవకు దారి తీసినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం సీనియర్లు, జూనియర్ల మధ్య మాటామాటా పెరిగి కొం త ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
విషయం తెలుసుకున్న పొలీసులు కేయూ కు వెళ్లి మీరందరూ సా యంత్రం స్టేషన్కు రావాలని చెప్పి వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఫస్టియర్ విద్యార్థులు ఓ విద్యార్థి సంఘం నాయకుడికి చెప్పడంతో సెకండియర్ వి ద్యార్థులు భోజనాలు చేస్తున్న క్రమంలో బయటి వ్య క్తులతో కలిసి మొత్తం 60 మందికిపైగా దాడి చేసి విచక్షణారహితంగా కొట్టినట్లు సమాచారం. రెండు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.