హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11: విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని కొనసాగించాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం అన్నారు. విశ్వవిద్యాలయ క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్ అధ్యక్షతన విశ్వవిద్యాలయ క్రీడామైదానంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ ఇంటర్ కాలేజియేట్ కబడ్డీ టోర్నమెంట్స్ను ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు.
క్రీడాపోటీలలో గెలుపు, ఓటములు ముఖ్యం కాదు, పోటీల్లో పాల్గొనటమే ప్రధానమన్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ ప్రతిభ ద్వారా పేరు ప్రతిష్టలు పెంచాలన్నారు. ప్రొఫెసర్ టి.మనోహర్ మాట్లాడుతూ ఈ పోటీల్లో మొత్తం 22 టీంలు పాల్గొంటున్నాయని, రెండ్రోజుల ఈ పోటీల్లో 12న సెమీఫైనల్స్, ఫైనల్స్, బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. విశ్వవిద్యాలయ వ్యాయమ కళాశాల నేతృత్వంలో జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి వై.వెంకయ్య, సోమన్న, బి.కుమారస్వామి, ఎస్.కిరణ్కుమార్, సుమన్, కిషన్, బుచ్చయ్య, పాషా పాల్గొన్నారు.