కృష్ణ కాలనీ, జూలై 31 : విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని ఎమ్మె ల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడులో గల కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని గురువా రం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల బాగోగులు అడిగి తెలుసుకొని వారి తో కలిసి భోజనం చేశారు. ప్రహరీ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో గమనించిన మధుసూదనాచారి వెంటనే పూర్తిచేసి, వి ద్యార్థులకు రక్షణ కల్పించాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
బాలికలకు ఉన్నతమైన విద్యను అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ హయాంలో కేజీవీబీ పాఠశాలలను ఏర్పాటు చేశామని, పాఠశాలల్లో సన్నబియ్యంతో కూ డిన ఆహారాన్ని అందజేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బండారి సంపూర్ణ, రత్నం రవి, నాంపల్లి ఐలయ్య, చింతల రమేశ్, లెంకల రాజిరెడ్డి, దేవరకొండ మధు, గుర్రం రవీందర్, బగ్గి రమేశ్, శశికాంత్ గౌడ్, ముద్దసాని కిరణ్, సదానందం, వెంకట్, సూర రాజేశ్, కప్పల శ్యామ్, సుగుణాకర్, గోవర్ధన్, రంజిత్, పూర్ణ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికులకు అండగా ఉంటా..
సింగరేణి కార్మికులకు అండగా ఉంటానని మధుసూదనాచారి అన్నారు. కేటీకే-1, 5 ఇైంక్లెన్ గనుల్లో నిర్వహించిన కార్మికుల ఉద్యోగ విరమణ కార్యక్రమాల్లో పాల్గొని రిటైర్డ్ అయిన కార్మికుల దంపతులను సన్మానించారు. అనంతరం కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ తాను శాసన సభాపతిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు హెచ్ఆర్ఏ పెంచి ఇప్పించానన్నారు. ఇక నుంచి వారంలో రెండు రోజులు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని, ఎవరికి సమస్య వచ్చినా తమకు తెలియజేయాలన్నారు.
భూపాలపల్లి ప్రజలతో తనది విడదీయలేని బంధమని, తన చివరి శ్వాస ఉ న్నంత వరకు సేవలు అందిస్తానన్నారు. ఈ సందర్భంగా మధుసూదనాచారిని ఓసీ కాం ట్రాక్ట్ కార్మికులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేదర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు అభిషేకం చేశారు. అదేవిధంగా అమరవీరుల స్తూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వేశాలపల్లి గ్రామంలో పలువురి బాధిత కుటుంబాలను, ఎల్బీనగర్ కాలనీకి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, సింగరేణి కార్మికుడు వనం అనిల్‌కుమార్ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి మనోధైర్యం చెప్పారు.