దుగ్గొండి : సైబర్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని ఎస్సై రావుల రణధీర్ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ రకాలుగా సైబర్ మోసగాళ్లు ఫోన్లకు మెసేజ్లు పంపుతున్నారని, మీ అకౌంట్కు వంద రూపాయలు పంపించామంటూ లింకులను పంపి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని, అటువంటి లింకులను ఓపెన్ చేయకుండా జాగ్రత్త పడాలని విద్యార్థులకు సూచించారు.
సోషల్ మీడియాకు దూరంగా ఉండి విద్యార్థులు తమ ఉన్నత లక్ష్యాలను సాధించుకోవాలని ఎస్సై సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎలగొండ రామస్వామి, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, సుశీల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.