కాశీబుగ్గ/ఖిలా వరంగల్, జూన్14: గ్రేటర్ వరంగల్ జిల్లా మండి బజార్లోని అరబిక్ రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం కుక్కర్ పేలింది. దీంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. జామియా మహ్మద్ ఖైర్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 88 మంది విద్యార్థులు ఉన్నారు. శుక్రవారం వంట చేస్తున్న క్రమంలో కుక్కర్ పేలడంతో అబ్దుల్ రెహమాన్ (12), సోను (12), షరీఫ్(12), నౌషధ్(11)కు గాయాలయ్యాయి. మొఖం, ఒంటిపై చర్మం కాలిపోవడంతో వారిని స్థానికులు వెంటనే ఎంజీఎం దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.