నమస్తే తెలంగాణ నెట్వర్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కలెక్టరేట్లు విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లాయి. పెండింగ్ సాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సరారు విద్యారంగ అభివృద్ధిని పూర్తిగా విస్మరించడంతో వేలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారన్నారు.తక్షణమే సాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ విద్యార్థుల కాస్మొటిక్ చార్జీల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27లోపు బకాయిలు విడుదల చేయకపోతే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధుల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.