హనుమకొండ చౌరస్తా, జులై 23 : మహబూబాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-17 బాయ్స్అండ్ గర్ల్స్11వ తెలంగాణ స్టేట్ సబ్-జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఈనెల 24 నుంచి 27 వరకు నిర్వహిస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎస్బీ ఏసీపీ డాక్టర్ మూల జితేందర్‌రెడ్డి, కార్యదర్శి డాక్టర్ కొమ్ము రాజేందర్ తెలిపారు. బుధవారం హనుమకొండలోని ఆఫీసర్స్‌క్లబ్ జరిగిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ఈనెల 24న క్వాలిఫైయింగ్ రౌండ్స్ఆఫీసర్ క్లబ్, కిట్స్ కాలేజ్ మధ్య నిర్వహిస్తున్నట్లు తెలిపారు 25న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పోటీలకు ముఖ్యఅతిథులుగా వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ సన్‌ప్రీత్ సింగ్, తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ టి.యాదగిరిరావు పాల్గొని ప్రారంభిస్తారని తెలిపారు.
ఈ పోటీల్లో 20 జిల్లాల నుంచి 145 క్రీడాకారులు పాల్గొంటారని, 176 ఎంట్రీలు వచ్చాయని మొత్తం 190 మంది క్రీడాకారులు సింగల్స్, డబుల్స్, మిక్స్ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. రాష్ర్ట బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిబంధనల మేరకు పాల్గొనే క్రీడాకారులకు ఉచిత వసతితో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 27 ఉదయం ముగింపు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, ఇంటర్నేషనల్ క్రీడాకారుడు, మాస్టర్స్బ్యాడ్మింటన్ సీఎం శశిధర్ పాల్గొని గెలుపొందిన వారికి షీల్డ్, బహుమతులు అందజేస్తారని చెప్పారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు డిసెంబర్లో ఒడిషాలోని భువనేశ్వర్‌లో జరిగే జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ పి.రమేశ్‌రెడ్డి, కోశాధికారి నాగకిషన్, సభ్యులు శంకర్ పాల్గొన్నారు.