ఖిలావరంగల్, సెప్టెంబర్ 27: యువ టూరిజం క్లబ్‌ల ఏర్పాటులో వరంగల్ జిల్లాను రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిపినందుకు కలెక్టర్ సత్య శారదకు అవార్డు దక్కింది. శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా ఆమె అవార్డు అందుకున్నారు.
తనకు అవార్డు రావడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని యువ టూరిజం క్లబ్‌ల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల ద్వితీయ స్థానం సాధించామన్నా రు. నిరాదరణకు గురైన 14 ఆలయాలను గుర్తించి, వాటి పునరుద్ధరణకు ప్రణాళికులు చేయనున్నట్లు తెలిపారు. పర్యాటకం, సంస్కృతీ సంప్రదాయాలు, వారసత్వ సంపదపై విద్యార్థుల కు అవగాహన కల్పించడంతో పాటు పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తామన్నారు.