గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయంలో పట్టణ ప్రగతి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేఎంసీ నుంచి పారిశుధ్య కార్మికులతో భారీ ర్యాలీ ప్రారంభించారు. ఎంజీఎం కూడలిలో సఫాయి కార్మికుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో సఫాయి కార్మికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని చెప్పారు. అనంతరం బల్దియా కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, సీపీ రంగనాథ్, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా వేడుకలకు హాజరయ్యారు.
వరంగల్,జూన్ 16 : ‘కష్ట సమయంలో సేవలందించిన సఫాయన్నలకు సలాం.. వందనాలు’ అని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవంలో అయన పాల్గొన్నారు. కార్పొరేషన్ కా ర్యాలయంలో మేయర్ గుండు సుధారాణి జాతీయ జెండాను ఎగురవేశారు. కేఎంసీ నుంచి ఎంజీఎం జంక్షన్ వరకు సాగిన ర్యాలీని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో మంత్రితో పాటు చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుం డు సుధారాణి, సీపీ రంగనాథ్ పాల్గొ న్నారు. కార్మికులతో కలిసి ఎంజీఎం కూ డలిలో మానవహారం నిర్వహించారు.
కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చారు. అనంతరం జంక్షన్లో ఏర్పాటు చేసిన సఫాయి అన్నకు సలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అందిస్తున్న పట్టణ ప్రగతి నిధులతో నగరాలు అభివృద్ధి బాటలో సాగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌లు పట్టణాల అభివృద్ధికి నిధుల వరద పారిస్తున్నారన్నారు. పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా వసతులు కల్పి స్తున్నారన్నారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో జరిగిన సభ లో మేయర్ గుండు సుధారాణితో కలిసి చీప్ విఫ్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మె ల్సీ బస్వరాజు సారయ్య బల్దియా ప్రగతి నివేదికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పట్టణాల అభివృద్ధిని విస్మరించాయన్నారు. పారిశుధ్య కార్మికులకు వసతుల కోసం తాను కార్పొరేటర్‌గా ధర్నాలు చేసిన సందర్భా లు ఉన్నాయన్నారు. పారిశుధ్య కార్మికులు అందించిన సేవలు గుర్తించి, సీఎం కేసీఆర్ వారికి వేతనాలు పెంచారన్నారు. ప్రతి డివిజన్లో అభివృద్ధి జరుగుతోందన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో గ్రేటర్ వరంగల్ అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. పట్టణ ప్రగతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.204 కోట్లు విడుదల చేసిందన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సార య్య మాట్లాడుతూ ప్రజలు, ప్రభుత్వం కలిసి అడుగులు వేసినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు.
ఆరోగ్య శిబిరం
పట్టణ ప్రగతి దినోత్సవాన్ని పురస్కరించుకొని బల్దియా ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన శిబిరంలో ప్రభుత్వ వైద్యులతో పాటు హైదరాబాద్ యశోదా దవాఖాన వైద్యులు పాల్గొని పారిశుధ్య కార్మికులు, ఉద్యోగులు, సిబ్బందికి వైద్య పరీక్షలు చేశారు.
ఫొటో ఎగ్జిబిషన్
కార్పొరేషన్ ఆవరణలో ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో వివిధ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన ఫొటోలను ఇందులో ప్రదర్శించారు. రూ.కోట్ల నిధులతో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి వివరాలనువ ప్రదర్శించారు.
మహిళలకు రంగోళి పోటీలు
పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా మహిళలకు రంగోళి పోటీలను నిర్వహించారు. వందలాది మంది మహిళలు పోటీలలో పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా స్వయంగా ముగ్గులను పరిశీలించారు. పోటీలో పాల్గొన్న మహిళలను అభినందించారు.
ఉత్తములకు ప్రశంసా పత్రాలు
కార్పొరేషన్లో ఉత్తమ సేవలు అందిస్తున్న 107 మంది ఉద్యోగులకు ప్రశంసా ప్రాంతాలను అందజేశారు. కార్పొరేటర, పారిశుధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.