రాయపర్తి : మండలంలోని పలు గ్రామాలలోని బాధిత కుటుంబాలను మైలారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మండల నాయకులతో కలిసి పర్యటించారు. మండలంలోని కొత్తూరులో బొమ్మినేని దేవకమ్మ, పెరుకవేడులో మంచాల మల్లయ్య, ఊగ యాకయ్య ఇటీవల అనారోగ్యాలతో మృతిచెందారు. కాగా, తన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నేతృత్వంలో మృతుల కుటుంబాలకు తలా 50 కిలోల బియ్యం, వంటనూనె, నిత్యావసర వస్తువులను అందజేశారు.
అదేవిధంగా మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు అయిత జంపిని కలసి పరామర్శించి రూ.5 వేలు ఆర్థిక సహాయంగా అందజేశారు. ఆయన వెంట మండల నాయకులు అనిమిరెడ్డి, పూస మధు, లేతాకుల రంగారెడ్డి, పోక్య సురేందర్ రాథో నాయక్, గజవెల్లి ప్రసాద్, ఎలమంచి శ్రీనివాసరెడ్డి, తదితరులున్నారు.