హసన్‌పర్తి, సెప్టెంబర్ 8: సిద్దాపూర్‌కు చెందిన జట్టి ఎల్లయ్య పెద్ద కూతురు శ్రీలత దివ్యాంగురాలు. స్వయం ఉపాధి కోసం స్థానికంగా బట్టల షాపు నిర్వహిస్తోంది. ఆమెకు కుడి చేయి, ఎడమ కాలు లేవు. ఇంటి నుంచి షాపునకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతుండగా తనకు వీల్‌చైర్ అందించాలని ట్విట్టర్ వేదికగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డికి ట్వీట్ వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అరూరి దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డితో మాట్లాడారు. వీల్‌చైర్‌కు కుడి వైపు నుంచి ఆపరేటింగ్ చేసే వీలుండగా ఆమెకు కుడిచేయి లేనందున, ఎడుమ చేతితో ఆపరేటింగ్ చేసేలా మార్పులతో బ్యాటరీ వీల్‌చైర్ చేయించారు. శుక్రవారం ఎమ్మెల్యే వాసుదేవారెడ్డితో కలిసి శ్రీలత ఇంటికి వెళ్లి ఆమెకు బ్యాటరీ వీల్‌చైర్‌ను అందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ శ్రీలతకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం శ్రీలత మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్, వాసుదేవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ సునీత, సర్పంచ్ ధనలక్ష్మి కిరణ్, వైస్ ఎంపీపీ బండా రత్నాకర్‌రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ జక్కు రమేశ్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు బండి రజనీకుమార్, మార్కెట్ డైరెక్టర్ వీసం సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
నయీంనగర్: మండలంలోని బండౌతాపురానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ పార్టీలలో చేస్తున్న క్రియాశీల కార్యకర్తలు, ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు కొత్తగా పార్టీలో చేరిన వారిని కలుపుకొని పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన కట్కూరి రాజు, గుండె రాజు, మరుపట్ల రాజు, రాములు, స్వామి, సోమయ్య, బుచ్చయ్య, ఉపేందర్, సుగుణాకర్, అజీమ్, మరుళి, శ్రీనివాస్, వెంకటయ్య, బాబు, ఏలియా, క్రిష్ణ తదితరులకు పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే స్వాగతించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బిక్షపతి, ఎంపీటీసీ సురేష్, పార్టీ నాయకులు పూజారి రఘు, తుమ్మల యాకయ్య, సాయి పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మడికొండ:ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, పేదల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 64వ డివిజన్ మడికొండలో నలుగురు లబ్ధిదారులకు రూ.2.50లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సాయంతో ఎంతో మంది పేదలకు పెండ్లి భారం తగ్గిందని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ కింద చికిత్సకు తగిన ఆర్థికసాయం అందజేయడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డి, నాయకులు పేపర్ రవి, రొయ్యల లక్ష్మణ్, బుర్ర రాజ్‌కుమార్, పల్లపు రాజేందర్, కాళేశ్వరపు రాజేందర్, పల్లపు నర్సింగరావు పాల్గొన్నారు.