Spring Spree | హనుమకొండ చౌరస్తా, మార్చి 2 : వరంగల్ నిట్‌లో స్ప్రింగ్‌స్ప్రీ అట్టహాసంగా ముగిసింది. మూడు రోజుల పాటు ఉత్సవాలు సాగ గా ఆఖరి రోజూ ప్రదర్శనలు, ఫ్యాషన్‌తో యు వత అదరగొట్టారు. విద్యార్థులు, కళాకారులు, ప్రేక్షకులు విశేషంగా పాల్గొని కళాత్మకత, బుద్ధి బలపరీక్షలు, సంగీతం, నాటకం, ఫ్యాషన్, వినోదంతో కూడిన అనుభూతిని ఆస్వాదించా రు. విద్యార్థుల్లోని ప్రతిభను వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఏటా స్ప్రింగ్‌స్ప్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు.
పోలరాయిడ్ ఫొటోగ్రఫీ, స్ట్రీట్ ఫోటోగ్రఫీ, ఎన్ఐటీడబ్ల్యూ పూర్వవిద్యార్థి ఆభాస్దాస్ గుప్తా నిర్వహించిన క్యూఫ్యాక్టర్ క్విజ్‌లో చరిత్ర, క్రీడలు, పాప్ కల్చర్ తదితర విభాగాల్లో ఆసక్తికరమైన ప్రశ్నలతో ఉతంఠగా సాగింది. అలాగే థింక్ డ్రాప్ రివీల్, ప్లింకోబోర్డు, వాట్స్ ఇన్‌ది బాక్స్, పిక్చర్ పజిల్ పోటాపోటీగా సాగాయి. అనంతరం నిర్వహించిన సంగీత మహోత్సవంలో తబలా, గిటార్, పియానో వంటి వాయిద్యాలతో అద్భుతమైన ప్రదర్శనలు నిర్వహించారు.
సోలో ఐడల్ -స్ప్రింగ్ స్ప్రీ సిగ్నేచర్ ఈవెంట్, సంగీత ప్రదర్శనల్లో పాటలు, ర్యాంప్ పాటలతో శ్రోతలను అలరించారు. సామాజిక అంశాలను ప్రతిబింబిస్తూ మానవ విలువలను చాటిచెప్పేలా నుకడ్ నాటక్(వీధి నాటకం) ప్రదర్శించారు. ఆరోహణ-జూలియస్ అండ్ సీజర్ కథ ఆధారంగా స్ఫూర్తిదాయక నాటకం ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. రాత్రివేళ ప్రసిద్ధ గాయకుడు నిఖిల్ డిసౌజా తన అద్భుతమైన సంగీతంతో ఆహుతులను మైమరపించారు. అనంతరం ‘అల్లూర్’ ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు హొయలు పోతూ ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేశారు. చివరిగా డీజే నైట్‌తో ఉత్సాహభరితంగా వేడుకలు ముగిశాయి.