హనుమకొండ చౌరస్తా, నవంబర్ 1: క్రీడలు విద్యార్థులకు చాలా అవసరమని ప్రతి జాతీయ స్థాయి క్రీడాకారుడు ఈ దశ నుండే ఎదుగుతారని క్రీడలకు ప్రభుత్వం ప్రాముఖ్యతని ఇస్తుందని ఎస్జిఎఫ్ అధ్యక్షుడు, హనుమకొండ ఇంఛార్జి డీఈవో, అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జిమ్నాస్టిక్స్ హాల్లో రాష్ర్టస్థాయి జిమ్నాస్టిక్స్, జూడో పోటీలు ఎస్జీఎఫ్ సెక్రటరీ వి.ప్రశాంత్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన వెంకట్‌రెడ్డి పోటీలను ప్రారంభించి క్రీడాకారులనుదేశించి మాట్లాడుతూ.. క్రీడలు సక్సెస్ కావడానికి వ్యాయామ విద్య ఉపాధ్యాయులే కారణమని వారి శ్రమ వలనే క్రీడలు సక్సెస్ అవుతున్నాయని తెలిపారు. విశిష్ట అతిథులు డీవైఎస్వో గుగులోతు అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించి తెలంగాణ రాష్ట్రానికి పథకాలు సాధించాలని కోరారు.
కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎస్.పార్థసారథి, టీ.ఎస్. పేట అధ్యక్షుడు ఏ.ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.కుమార్, కన్వీనర్లు సిహెచ్.పెద్దిరాజు, ఎం.సురేష్‌బాబు, వి.రాణి, ఎస్.శ్రీలత, జూడో అబ్జర్వర్ సత్యనారాయణ, క్రీడా ఆర్గనైజింగ్ సెక్రెటరీ సిహెచ్.వెంకటేశ్వర్లు, ఆర్.సుభాష్, జి.రవీంద్ర ప్రసాద్, నీలం సురేష్, దేవేందర్, కిషన్, సుమలత, లక్ష్మీ పాల్గొన్నారు.