నర్సంపేట/ఖానాపురం/దుగ్గొండి/నర్సంపేటరూరల్/పర్వతగిరి, డిసెంబర్ 25: క్రిస్మస్ వేడుకలను ఆదివారం జిల్లావ్యాప్తంగా క్రిస్టియన్లు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్‌లు కట్ చేసి సంబురాలు నిర్వహించారు. పలు చర్చిల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నర్సంపేట పట్టణంలోని చర్చిల్లో జరిగిన వేడుకల్లో క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్లు ప్రార్థనల్లో పాల్గొని సందేశాలిచ్చారు. ఖానాపురం గుడ్‌న్యూస్ బాప్టిస్ట్ చర్చిలో బుధరావుపేట యోహోరఫ్ఫా ప్రార్థనా మందిరం, వేపచెట్టుతండాలో ప్రేజ్ బాపిస్టు చర్చి, అశోక్‌నగర్ సీఏసీ చర్చి, గొల్లగూడెంతండా చర్చిలో పాస్టర్లు మిల్టన్, డేవిడ్, బెన్నీ, స్వామి, దయాకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఖానాపురం, బుధరావుపేట, మంగళవారిపేట చర్చిల్లో జరిగిన వేడుకలకు ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, సర్పంచ్ గొర్రె కవిత, రవి, గుగులోత్ కిషన్ హాజరై ఏసుప్రభు సేవలను కొనియాడారు.
దుగ్గొండి మండలం వెంకటాపురం చర్చిలో ఎన్నారై శానబోయిన రాజ్‌కుమార్ కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. బంధంపల్లి హోలీ ఫ్యామిలీ చర్చి, మండలకేంద్రంలో సీయోను ప్రార్థనా మందిరం, చలపర్తిలో పరిశుద్ధ సహవాస ప్రార్థనా మందిరం, మల్లంపల్లి, తొగర్రాయి, తిమ్మంపేట, రేకంపల్లి, చాపలబండలో క్త్రెస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్లు కేక్‌లు కట్ చేసి ప్రజలకు శాంతి సందేశాలు అందించారు. నిరుపేదలకు దుస్తులు అందించి అన్నదానం చేశారు. నర్సంపేట మండలం మహేశ్వరం శివారులోని బాలఏసు దేవాలయంలో క్రిస్మస్ వేడుకలను రెవరెన్స్ ఫాదర్ ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేసి పంపిణీ చేశా రు. కార్యక్రమంలో సిస్టర్లు సిల్వియారాణి, రష్మిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముత్తోజిపేటలోని నెబో బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి.
రెవ కేకే శంకరయ్య, ఎస్తేరా, క్రిస్టియన్లు, నాయకులు పాల్గొన్నారు. రామవరం చర్చిలో సర్పంచ్ కొడారి రవన్న, ఫాదర్లు కేక్ కట్ చేశారు. గుంటూరుపల్లిలో సర్పంచ్ కర్నాటి పార్వతమ్మ, వార్డు సభ్యులు, భాంజీపేటలో ప్రజాప్రతినిధులు, రాజుపేట పరిధిలోని గార్లగడ్డతండా లైట్‌హౌస్ చర్చిలో ఆల్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ నర్సంపేట డివిజన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఫాదర్ చంద్రకాంత్ జాన్, సామ్యేల్, రవి, ఇల్సన్ పాల్గొన్నారు. పర్వతగిరి మండలం చౌటపెల్లి, కొంకపాక, పర్వతగిరి, చింతనెక్కొండలోని చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఏనుగల్లు బెరెకా బాప్టిస్టు చర్చిలో పాస్టర్లు సుజాతా డేవిడ్ కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బోంపెల్లి దేవేందర్‌రావు, సర్పంచ్ దమ్మిశెట్టి సంధ్యారాణి-నర్సింగం, ఎంపీటీసీలు కోల మల్లయ్య, ఉపసర్పంచ్ పెండ్లి రమేశ్, వార్డు సభ్యులు రజిని, తమ్మిశెట్టి శ్రీనివాస్, వెంకట్, అధ్యక్షుడు గిరిబాబు, భాస్కర్, కుమారస్వామి, కమల్‌హాసన్ పాల్గొన్నారు.
ఉత్సాహంగా వేడుకలు..
రాయపర్తి: మండలంలోని అన్ని గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను క్రిస్టియన్లు ఉత్సాహంగా జరుపుకున్నారు. మండలకేంద్రంలోని మన్నా చర్చితోపాటు కొత్తూరు, పెర్కవేడు, మైలారం, సన్నూరు, కాట్రపల్లి, కొండూరు, తిర్మలాయపల్లిలోని చర్చిల్లో క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొత్తూరులో జరిగిన వేడుకల్లో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, సర్పంచ్ కందికట్ల స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దొమ్మాటి సుభాష్, మండలకేంద్రంలోని మన్నా చర్చిలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్ల సుధీర్‌రెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, పెర్కవేడులోని చర్చిలో జరిగిన ప్రార్థనల్లో సర్పంచ్ చిన్నాల తారాశ్రీ రాజబాబు, ఎంపీటీసీ బండి అనూషా రాజబాబు, బీఆర్ఎస్ నాయకుడు పూస మధు, మతబోధకులు నెల్సన్, విల్సన్, యాకూబ్, యోబు, యోహాన్, ఆనంద్ పాల్గొన్నారు.
క్రీస్తు బోధనలు ఆచరణీయం
సంగెం: ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని ఎంపీపీ కందకట్ల కళావతి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా కుంటపల్లిలోని చర్చిలో జరిగిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కావటి వెంకటయ్య, దానం స్వామి, బొజ్జ సురేశ్, చిలువేరు శ్రీనివాసులు, మెట్పల్లి కుమారస్వామి, కల్యాణ్‌రాజు, రమేశ్, సమ్మయ్య, ప్రవీణ్ పాల్గొన్నారు.