హనుమకొండ చౌరస్తా, జులై 29 : హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కాలేజీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి సినారె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సినారె దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఎన్నో అవార్డులు, సత్కారాలు, బిరుదులు పొందడం తెలుగువారందరూ గర్వించదగ్గ విషయం అన్నారు.
ఎన్నో సినిమా పాటలను రచించి, ఉత్తమ సినీ గేయరచయితగా గౌరవం పొందారని, సినారె లాంటి
గొప్ప కవులను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు కూడా సమాజాన్ని చైతన్య పరిచే రచనలు చేయాలని ఆకాంక్షించారు. తెలుగు విభాగాధిపతి ఎస్.మధు, అధ్యాపకులు ఆర్.లక్ష్మీకాంతం, రామా రత్నమాల, బి.సునీత, కె.రాజేశ్వరి, యుగంధర్, విద్యార్థినులు పాల్గొన్నారు.