హసన్‌పర్తి, జూన్ 5: నీట్-2024 ఫలితాల్లో శివాని కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపినట్లు కరస్పాండెంట్ టీ స్వామి బుధవారం తెలిపారు. విద్యార్థులు సీహెచ్ సాత్విక, ఎస్.సాయిప్రియ, వీ భవాని, ఎన్.ప్రదీప్, ఇ.కార్తీక్, సీహెచ్ సాద్విక, ఎల్.అనూష, బీ లోకేశ్, ఎం.ముఖేశ్, ఎన్. వర్షిత, కే శివసాయి, ఏ మనోజ్, డీ కీర్తన మంచి ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. కొన్నేళ్ల నుంచి కార్పొరేట్‌కు దీటుగా తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కరస్పాండెంట్‌తోపాటు ప్రిన్సిపాళ్లు జీ సురేందర్‌రెడ్డి, వీ చంద్రమోహన్, డైరెక్టర్ టీ రాజు, ఎన్.రమేశ్, ఏ మురళి, వీ సురేశ్, ఎస్.సంతోష్‌రెడ్డి అభినందించారు.