కాశీబుగ్గ, మార్చి 6: కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా తమిళనాడులోని కుంభకోణంలో తయారు చేసిన శివపార్వతుల విగ్రహాలకు కల్యాణ తంతు గావించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బయ్యాస్వామి, డాక్టర్ గోనె జగదీశ్వర్, మండల శ్రీరాములు, మామిడి ఈశ్వరయ్య, ముచ్చర్ల ప్రభాకర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.