కొడకండ్ల : ఇష్టా రాజ్యాంగ ఇందిరమ్మ ఇండ్ల జాబితా తయారు చేస్తున్నారని, గ్రామసభలు ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో కాంగ్రెస్ నాయకులకే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల జాబితా ప్రజల నుండి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందన్నారు.
మాజీ మార్కెట్ చైర్మన్ రాము మాట్లాడుతూ మండలంలో ప్రస్తుతం చేసే అభివృద్ధి పనులన్నీ ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ఉన్న సమయంలో కేటాయించిన నిధులతోనే కొనసాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు మండలానికి రూపాయి నిధులు కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రమాజీ జీసీసీ చైర్మన్ అభిమాన్ గాంధీ నాయక్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు కూడా నాణ్యత లేకుండా చేస్తున్నారని, క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ విచారణకు కలెక్టర్ మెమోరాండం అందజేస్తామని హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ మెటీ సోమరాములు, మండల మాజీ రైతుబంధు అధ్యక్షుడు దీకొండ వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు బాకీ ప్రేమ్ కుమార్, పట్టణ అధ్యక్షులు మాసరం వెంకటనారాయణ, పార్టీ పాలకుర్తి నియోజకవర్గం సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ దేశగాని సతీష్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్యా మాగ్య నాయక్, భూక్యా శ్రీను, గుగులోత్ బాలకిషన్, మల్లికార్జున, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.