Sayampet BJP | శాయంపేట: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో శాయంపేటలో ఆ పార్టీ శ్రేణులు శనివారం రాత్రి సంబరాలు చేసుకున్నాయి. బస్టాండ్ కూడలిలో బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ శాయంపేట మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ ఢిల్లీలోని ప్రజలు చాలా వివేకవంతులని పేర్కొన్నారు. అవినీతి రూపుమాపుతానని చెప్పి అదే అవినీతిలో కూరుకుపోయిన ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు బుద్ధి చెప్పారని అన్నారు. ఎన్నో దొంగ హామీలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఒక్క సీటు ఇవ్వకపోవడం అక్కడి ప్రజల వివేకానికి నిదర్శనమని అన్నారు.
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి మాట్లాడుతూ అమ్ ఆద్మీ పార్టీ గుర్తు చీపురుతోనే ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చిపారేసారని అన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ దేశాన్ని ఢిల్లీ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం ఈ దేశంలో ఆ పార్టీ పరిస్థితి అర్థం అవుతుందని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి పోయి కూడా ఇచ్చిన హామీలను అక్కడి ప్రజలు నమ్మకపోవడం, వారికి ఒక్క సీటు ఇవ్వలేదన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, ఉప్పు రాజు, సీనియర్ నాయకులు కోమటి రాజశేఖర్, భూతం తిరుపతి, బత్తుల రవి, ఆనుమండ్ల రమేష్, రేణికుంట్ల చిరంజీవి, మేకల సుమన్, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి చంద్రమౌళి, బాసాని నవీన్, పైడిమల్ల సుధాకర్, గాదే సుధాకర్, కన్నబోయిన రమేష్, కుక్కల సతీష్, బండి ప్రవీణ్, బత్తుల రాజేష్, మోరే రంజిత్, తదితరులు పాల్గొన్నారు.