హనుమకొండ, నవంబర్ 3 : తెలంగాణ రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-14, 17, 19 జిమ్నాస్టిక్స్పోటీలు, అండర్ 17 ఇయర్స్జూడో పోటీలు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ(జేఎన్ఎస్)లో ముగిశాయి. మూడురోజుల ఈ క్రీడా పోటీలకు జిమ్నాస్టిక్స్నుంచి 300 మంది జూడో పోటీలకు 200 మంది క్రీడాకారులు పాల్గొని వారి ప్రతిభను కనబర్చారని ఎస్జిఎఫ్ సెక్రెటరీ వి.ప్రశాంత్‌కుమార్ తెలిపారు. మెడల్స్సాధించిన క్రీడాకారులు జాతీయస్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ర్ట కీర్తి పతాకాన్ని జాతీయస్థాయిలో ఎగురవేయాలని ఈ సందర్భంగా కోరారు. జిమ్నాస్టిక్ జాతీయస్థాయి క్రీడలు వెస్ట్‌బెంగాల్‌లో, జూడో జాతీయస్థాయి క్రీడలు అరుణాచల్‌ప్రదేశ్‌లో జరుగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిజిపేట హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎస్.పార్థసారథి, ప్రధాన కార్యదర్శి కే.మల్లారెడ్డి, ఏ.ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.కుమార్, హనుమకొండ జిల్లా యువజన క్రీడల అధికారి గుగులోతు అశోక్‌కుమార్, భూపాలపల్లి డీవైఎస్వో సిహెచ్.రఘు, అబ్జర్వర్లు స్వామిరాజ్, సత్యనారాయణ టీజీ పేట రాష్ర్ట అసోసియేట్ అధ్యక్షుడు బి.సుధాకర్, కన్వీనర్లు సిహెచ్.పెద్దిరాజు, ఎం.సురేష్‌బాబు, ఎస్.శ్రీలత, పీడీలు ఆర్.సుభాష్‌కుమార్, సిహెచ్ వెంకటేశ్వర్లు, జి.రవీంద్రప్రసాద్, నీలం సురేష్, రజిత, హరీష్, వినయ్ పాల్గొన్నారు.