వరంగల్, మార్చి 6: గ్రేటర్ కార్పొరేటర్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్, స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో స్మార్ట్‌సిటీ స్టేక్‌హోల్డర్స్ అయిన ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, బల్దియా, కుడా, పీసీబీ, పబ్లిక్ హెల్త్ ఉన్నతాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఇప్పటికే గ్రేటర్ కార్పొరేషన్ పాలనా భవనం మొదటి అంతస్తులో ఐసీసీసీ తాత్కాలిక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఐసీసీసీ ఏర్పాటుకు డీపీఆర్ రూపొందించేందుకు సెలక్షన్ ఆఫ్ మాస్టర్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌పై నిపుణులు ప్రభుత్వ శాఖల సలహాలు, సూచనలు స్వీకరిస్తారని తెలిపారు. వివిధ శాఖ అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మ్యాపింగ్ చేసేందుకు పంపాలని సూచించారు.
ఏరియా, ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్, సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టమ్, సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్, పెలికాన్ సిగ్నల్ సిస్టమ్, వేరియబుల్ మెసేజింగ్ సిస్టమ్, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్, ఈ గవర్నెన్స్, ఎన్విరాన్మెంటల్ సెన్సార్ సిస్టమ్, జిమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి పలు సూచనలు చేశారు. సమర్థ నిర్వహణకు వివిధ శాఖల ఉన్నతాధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. గ్రేటర్ కార్పొరేషన్లో రూ.98.05కోట్ల స్మార్ట్‌సిటీ నిధులతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చేస్తున్నామని తెలిపారు. ఐసీసీసీలో మొత్తం సిటీలో 600 సర్వేలెన్స్ కెమెరాలు, 10 జంక్షన్ల అభివృద్ధి, నగరానికి వచ్చే వాహనాల నంబర్లతో సహ గుర్తించేలా ఏఎన్పీఆర్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఐసీసీసీలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, కుడా, ఆర్అండ్బీ, పబ్లిక్‌హెల్త్, కలెక్టర్ కార్యాలయం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విద్యాశాఖ వారి అవసరాల మేరకు సర్వేలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలోని స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్, ఎలక్ట్రికల్స్‌కు సంబంధించిన సీసీఎంఎస్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. జీపీఎస్ మ్యాపింగ్, కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఖాళీస్థలాలు, అండర్ గ్రౌండ్ యుటిలిటీ మ్యాపింగ్ బల్దియాలోని వివిధ విభాగాలకు చెందిన జీడబ్ల్యూఎంసీ యాప్‌ల వివరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తామన్నారు. వరంగల్ అదనపు కలెక్టర్ శ్రీవాత్సవ, డీసీపీలు పుష్పా, అబ్దుల్ బారీ, స్మార్ట్‌సిటీ పీఎంఈ ఆనంద్ వోలేటి, ఎస్ఈలు ప్రవీణ్‌చంద్ర, కృష్ణారావు, సిటీప్లానర్ వెంకన్న, కుడా చీఫ్ ప్రాజెక్ట్ అధికారి అజిత్‌రెడ్డి, ఈఈలు శ్రీనివాసరావు, రాజయ్య, రాజ్‌కుమార్, పబ్లిక్ హెల్త్, ఆర్అండ్బీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, నిట్ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ పాల్గొన్నారు.
పబ్లిక్ ప్లేసుల్లో గుండెపోటు సంరక్షణ యంత్రాలు
ఇటీవల గుండెపోటుతో ప్రజలు చనిపోతున్న నేపథ్యంలో పురపాలకశాఖ మంత్రి ఆదేశాల మేరకు ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబిలెటర్స్ పరికాలను గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో 10 పబ్లిక్ ప్లేసుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ ప్రావీణ్య తెలిపారు. గుండెపోటుకు గురైన వారిని ఈ పరికరం ద్వారా ఎలా కాపాడవచ్చనే అంశంపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా నిపుణులు వివరించారు. త్వరలోనే వీటిని నగరంలోని పది పబ్లిక్ ప్లేసుల్లో ఏర్పాటు చేస్తామని వివరించారు.