గిర్మాజీపేట/కరీమాబాద్, డిసెంబర్ 29: జీడబ్ల్యూఎంసీ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ వరంగల్ 29వ డివిజన్లోని కుంటి భద్రయ్య గుడి వద్ద బాబూ జగ్జీవన్‌రామ్ కమిటీ హాల్ గ్రేటర్ కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు మేయర్ స్వెటర్లు పంపిణీ చేసి మాట్లాడారు. నగర పరిశుభ్రతకు కార్మికులు ఎంతగానో శ్రమిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదానందం, నాయకులు వాడిక నాగరాజు, శ్రీరాముల సురేశ్, పూజారి కుమారస్వామి, బొమ్మకంటి క్రాంతి, మామునూరి రాజు, రడపాక కుమార్, మాల్వరాజు, ఇజ్జగిరి భీమ్రాజ్, మట్టెవాడ సారంగం, తాళ్లపెల్లి సంతోష్‌గౌడ్, ఎండీ జావిద్, గట్టు శివ, మార్త కిరణ్ పాల్గొన్నారు. అలాగే, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వెటర్లను కార్మికులకు 25వ డివిజన్ బీఆర్ఎస్ నేత బస్వరాజు శ్రీమాన్ పంపిణీ చేశారు.
నాయకులు ఎండీ మస్తాన్, జన్ను శ్యామ్, బిల్లా రమేశ్, పీ అశోక్ పాల్గొన్నారు. అలాగే, 41వ డివిజన్లోని కార్మికులకు కార్పొరేటర్ పోశాల పద్మ స్వెటర్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని తెపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. 39వ డివిజన్లో కార్పొరేటర్ సిద్దం రాజు, 40వ డివిజన్లో కార్పొరేటర్ మరుపల్ల రవి డివిజన్ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు స్వెటర్లు పంపిణీ చేశారు.
కార్మికులు గరంకోట్లను ధరించాలి
పోచమ్మమైదాన్: ఉదయం, రాత్రి వేళల్లో పని చేసే కార్మికులు గరంకోట్లను ధరించాలని వరంగల్ 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్ అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సోల రాజు, నాయకులు వనపర్తి శ్రీనివాస్, ఇనుముల నాగరాజు, సోల శేఖర్, జవాన్లు సాంబయ్య, పిండి శివ, కార్మికులు పాల్గొన్నారు. అలాగే, 22వ డివిజన్ పోచమ్మమైదాన్‌లో కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి స్వెటర్లు పంపిణీ చేశారు. చలి నుంచి రక్షణ పొం దేందుకు కార్మికులు స్వెటర్లు ధరించాలన్నారు. అలాగే, 19వ డివిజన్లో కార్పొరేటర్ ఓని స్వర్ణలతా భాస్కర్ ఆధ్వర్యంలో కార్మికులకు షెటర్లు పంపిణీ చేశారు. శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పారిశుధ్య కార్మికులు, శానిటర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జవాన్ అరికాల మోహన్, ఓని కృష్ణ పాల్గొన్నారు.
66 డివిజన్లు.. 3500 స్వెటర్లు..
వరంగల్: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్లలో పని చేస్తున్న కార్మికులకు సుమారు 3500 స్వెటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 29వ డివిజన్లో స్వెటర్లు పంపిణీ చేసి మేయర్ సుధారాణి మాట్లాడుతూ ఎండ, వాన, చలి కాలాల్లో పారిశుధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. చలికాలం నేపథ్యంలో కార్మికులకు స్వెటర్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్ సాంబ య్య, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు సదాంత్, నాగరాజు పాల్గొన్నారు.