నెల్లికుదురు, జూన్ 16 : తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాలకై ఈ నెల 18న మండల కేంద్రంలో ఎంపీక పోటీలు నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి ఏ.రాందాసు తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో సోమవారం ఫిజికల్ డైరెక్టర్లతో పోటీల నిర్వాహణకై సన్నహాక సమావేశం నిర్శమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 3వ తరగతి పూర్తి చేసి 01/09/2016 నుండి 31/08/2017 మధ్య జన్మించిన పిల్లలు ఈ పోటీలకు అర్హులని తెలిపారు. మండలస్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపీక చేస్తారని పేర్కొరన్నారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్హత కలిగి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా వారిని ప్రోత్సహించి మండల కేంద్రంలో జరిగే పోటీలకు తీసుకుని రాగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఓఎఫ్ కార్యదర్శి సత్యనారాయణ, మండల ఫిజికల్ డైరెక్టర్లు సీహెచ్ ఐలయ్య, ఎండీ హిమామ్, ప్రవీణ్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.