శాయంపేట, మే 31 : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకలో అరుదైన పుష్పం వికసించింది. సియర్స్ జమాకారు అని పిలిచే మొక 16 సంవత్సరాలకు ఒకసారి పూస్తుంది. గ్రామానికి చెందిన కోమనేని రఘు ఇంటి ఆవరణలో పెంచుతుండగా శుక్రవారం మొదటి పువ్వు పూసింది. ఇది కాక్టస్ జాతికి చెందిందని, మూత్రం ఇన్ఫెక్షన్, మూత్రపిండాల వాపు, రుమాటిజం చికిత్సలో ఉపయోగించే ఆహారం, ఔషధ ఉత్పత్తిలో వినియోగిస్తారని రఘు తెలిపారు.