హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 5 : హనుమకొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణ 137వ జయంతి పురస్కరించుకొని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్‌ఖాన్ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చైర్మన్ అజిజ్ఖాన్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ దేశానికి రెండో రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, దేశానికి మొదటి ఉపరాష్ర్టపతిగా పనిచేశాడన్నారు.
భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో చైనా, పాకిస్తాన్‌తో యుద్ధసమయం ప్రధానులకు మార్గనిర్దేశం చేశారని ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో 50వ డివిజన్ కార్పొరేటర్ నెక్కొండ కిషన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కందుల సృజన్కాంత్, గ్రంథ పాఠకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.