వరంగల్ మహానగరాన్ని సాంస్కృతిక, కళాకేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా రూ.50 కోట్లతో కాళోజీ కళాక్షేత్రం పనులు ప్రారంభించింది. 4.25 ఎకరాల్లో నాలుగు అంతస్తుల భవనానికి డిజైన్ రూపొందించింది. భవనంలో 1500 సీటింగ్ సామర్థ్యంతో ఒక ఆడిటోరియం, మినీ మీటింగ్ హాల్, డైనింగ్ హాళ్లు, వీఐపీ సూట్స్‌ను అత్యాధునికంగా నిర్మిస్తోంది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జనవరి లోపు పూర్తిచేసేందుకు అధికారులు కళాక్షేత్రం పనులు ముమ్మరం చేశారు.
నర్సంపేట, ఆగస్టు 18: వెనుకబడిన వర్గాల స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం వీరోచిత పోరాటం చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన పాపన్న 372 జయంతిలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ సర్వాయి పాపన్న మొఘల్ చక్రవర్తుల అరాచక పాలనను ఎదిరించిన ధీరుడని కొనియాడారు. భూస్వాములు, పెత్తందార్లను ఎదురించి బడుగు బలహీన వర్గాలకు సమానత్వాన్ని పంచిన మహోన్నతశక్తి సర్వాయి పాపన్నగౌడ్ అన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో పవన్‌కుమార్, తాసిల్దార్ రామ్మూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు గిరగాని సాంబయ్యగౌడ్, సోల్తి సారయ్యగౌడ్, గంప రాజేశ్వర్‌గౌడ్, రామగోని సుధాకర్‌గౌడ్, పుల్లూరి స్వామిగౌడ్, పంజాల రాజుగౌడ్, తాళ్లపెల్లి కుమారస్వామిగౌడ్, తాళ్లపెల్లి చంద్రమౌళి గౌడ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సర్వాయి పాపన్న చిత్రపటానికి నివాళి
ఖానాపురం/చెన్నారావుపేట/పర్వతగిరి: సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతిని ఖానాపురంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి గౌడ సంఘం ఆధ్యక్షుడు గంగాపురం రమేశ్ పూలమాల వేసి నివాళులర్పించారు. సారయ్య, మనోహర్, కుమారస్వామి, వెంకటేశ్వర్లు, చంద్రయ్య, రాజు, రాజ్‌కుమార్, సదానందం, ఎల్లగౌడ్, కుమార్, కృష్ణ, దర్గయ్య, శ్రీను, విజయ్ పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా గోపా వరంగల్ అసోసియేట్ అధ్యక్షుడు రామగోని సుధాకర్‌గౌడ్ మాట్లాడుతూ బహుజన బావుటా ఎగరవేసిన తొలి విప్లవకారుడు పాపన్నగౌడ్ అని కొనియాడారు. మేడి వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ ప్రభాకర్, మేడి సుధాకర్, మచ్చర్ల సమ్మయ్య, రామగోని రవి, బుచ్చి రాములు పాల్గొన్నారు. పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంతోపాటుగా పర్వతగిరిలో పాపన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహం, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పండ్లు పంపిణీ చేశారు. తహసీల్దార్ కోమీ, తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు పట్టాపురం ఏకాంతంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్‌కుమార్‌గౌడ్, గౌడ సంఘం మండల అధ్యక్షుడు రంగు జనార్దన్‌గౌడ్, సర్పంచ్‌లు మాలతి, బండి సంతోష్‌గౌడ్, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు చింతపట్ల సోమేశ్వర్రావు, ఎంపీటీసీలు బొట్ల మహేంద్ర, మాడ్గుల రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, చింతల శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
గౌడకులస్తుల బైక్ ర్యాలీ
సంగెం/నెక్కొండ: సంగెం మండలం పల్లార్గూడలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కల్లు మండువలో సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి గీత కార్మికులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తాటిచెట్టు ఎక్కిన కార్మికులు వినూత్న రీతిలో జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. తర్వాత జాతీయ జెండాలతో గ్రామంలో బైక్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు కక్కెర్ల కుమారస్వామిగౌడ్, మాజీ అధ్యక్షుడు బొమ్మ కోటేశం, ఉపాధ్యక్షుడు బొమ్మ దామోదర్, కార్యదర్శి జూలూరి అశోక్, సొసైటీ డైరెక్టర్లు చీకటి కృష్ణ, బొల్లికొండ శివ, కక్కెర్ల చిరంజీవి, పోశాల సాంబయ్య, బైరీ శివాజీ, నాగపురి శ్రీను పాల్గొన్నారు. నెక్కొండలో పీఏసీఎస్ చైర్మన్ మారం రాము, మోకుదెబ్బ నాయకులు పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు తాళ్లపెల్లి చెన్నకేశవులు, గిరగాని శ్రీనివాస్, ముంజ జనార్దన్, కక్కెర్ల నాగయ్య, పలుసం రాజేందర్, దొనికెన మధు, గంధం రాజు, కొయ్యడ శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్, పలుసం ముత్తయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మెండె వెంకన్న, డైరెక్టర్ లావుడ్యా యాకూబ్, దీక్షకుంట సర్పంచ్ ఆలకుంట సురేందర్, రామాలయ కమిటీ చైర్మన్ పొడిశెట్టి సత్యం, టీఆర్ఎస్ నాయకుడు ఈదునూరి యాకయ్య పాల్గొన్నారు.